పేదవాడి ఆకలి తీర్చడానికి తామున్నామంటూ ముందుకు వచ్చిన రైతులు.
సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా వైరస్ దృష్ట్యా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఊపందుకుంటున్న సహాయక చర్యలు.
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ అన్నదాతలు.
పేదవాడి ఆకలి తీర్చడానికి తామున్నామంటూ ముందుకు వచ్చిన రైతులు.
*వెంకటాచలం మండలం అనికేపల్లి, గొలగమూడి గ్రామాలలో ఎకరాకు ఒక బస్తా ధాన్యాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు.*
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ కార్యదర్శి కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకే రోజు 10 టన్నుల ధాన్యం సేకరణ.*
*రైతుల నుండి సమీకరించిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కాకాణికి అందజేసిన రైతులు, నాయకులు.*
*ఒక అనికేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే 40 టన్నుల ధాన్యాన్ని సేకరించడానికీ లక్ష్యంగా నిర్దేశించుకున్న వైయస్సార్సీపీ నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, రాజా నాయుడు తదితరులు.*
*మిల్లింగ్ బాధ్యతలను వారే చేపట్టి 20 టన్నుల బియ్యాన్ని సిద్ధం చేస్తున్న గ్రామ స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.*
*ఒక్క గ్రామంలోనే సుమారు 20 నుండి 25 టన్నుల బియ్యాన్ని అందజేయడానికి ముందుకు వచ్చిన అన్నదాతలకు, సహకరించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.*
*ప్రతి కుటుంబానికి అవసరమైన బియ్యం, కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులను కూడా నియోజకవర్గంలో పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్న ఎమ్మెల్యే కాకాణి.*
*"సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యునిగా రెండుసార్లు గెలుపొంది, నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే భాగ్యం కలగడం నా అదృష్టం" అని తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.*