చాలా బాధగా ఉంది

చాలా బాధగాను భయంగానూ ఉంది . 


అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు . 


మొదట 50 వేలు కేసులు రావటానికి రెండు నెలలు పడితే రెండో సగం అనగా మిగతా 50 వేలు కేవలం గత మూడురోజుల్లోనే నమోదయ్యాయి . 


ఇంకా విషాదమేమిటంటే .. టెస్ట్ కిట్లు కొరత వలన చాలా మందిని టెస్ట్ చేయకుండానే మందులిచ్చి ఇంట్లోనే ఉండమని పంపుతున్నారు . 


నిపుణల అంచనాల ప్రకారం జూలై ఆఖరికల్లా అమెరికాలో లక్షమంది చనిపోయే అవకాశం ఉందంట . 


పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ట్రంప్ మాత్రం దేశంలో లాక్ డౌన్ చేసేదే లేదు , లాక్ డౌన్ చేస్తే వ్యాపారాలు దిబ్బతిని దేశం ఆర్థికంగా నష్టపోతుందని వితండ వాదం చేస్తున్నాడు . 


మనుషులు చచ్చాక డబ్బులు ఏం చేసుకుంటారో ? 


లేకపోతే పోయినోళ్ళు పోంగా మిగిలిన వాళ్ళు లాభపడతారని ( దేశం ఆర్థికంగా బాగుంటే ) .. వాళ్ళే మళ్ళీ గెలిపిస్తారని ట్రంప్ ఆలోచన కాబోలు ..


చైనాలో మొదటి కరోనా కేసు నవంబర్ 15 న వెలుగు చూసింది . అమెరికాలో మొదటి కేసు జనవరి రెండో వారంలో వెలుగు చూసింది . అప్పటినుండి ఇప్పటివరకూ ట్రంప్ చేసింది సూన్యం . 


కనీసం ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కి సరైన గైడెన్స్ లేదు , ప్రోటోకాల్ లేదు .. టెస్టింగ్ కిట్లు లేవు . 


ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఒబామా లాంటి నాయకుడు లేకపోవటం కొట్టొచ్చినట్లు కనబడుతుంది . 


ట్రంప్ లాంటి ని ఎన్నుకున్నందుకు అమెరికన్లు అనుభవిస్తున్నారు .


Popular posts
ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం
Image
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
ఎటువంటి యిబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు