అపార్ట్ మెంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు

అపార్ట్ మెంట్లో అక్రమంగా మద్యం అమ్మకాలు:


21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా వ్యాపార సంస్థలన్నీ బంద్ అయ్యాయి. వీటితో పాటు వైన్ షాపులు కూడా బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే వీరి బలహీనతను ఆసరా చేసుకొని కొందరు అక్రమ వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారానికి తెర లేపారు. తాజాగా నరసరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్ లో ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ పక్కనే ఉన్న విద్యా విహార్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో దేవరకొండ అంజి రెడ్డి అనే వ్యక్తి తన ఫ్లాట్ లో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ పట్టుబట్టాడు. అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. అక్కడ ఇంటి లోపల బాత్రూం లో మద్యం ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు.