సమాజమా ఆలోచించు..!

శ్రీకాకుళం :


ఓ సమాజమా ఆలోచించు..!


జర్నలిస్ట్ అంటే ఎందుకంత చులకన...?


చాలీ చాలని జీతాలతో బతుకు బండిని ఈడ్చుకుంటూ... పెళ్ళాం పిల్లలకి పట్టుమని ఒక రోజు కూడా కేటాయించలేని జర్నలిస్ట్ గురించి ఓ సమాజమా ఆలోచించు...!


ఏం మేము చేసేది సమాజాసేవ కాదా...


ఇదే చమట వేరే చోట చిందిస్తే ఇంతకంటే మంచి బతుకు రాదా..?


సమయానికి ఇంటికి చేరుకోలేమా..? పెళ్ళాం పిల్లలతో మీలాగే సరదాగా ఉండలేమా..?


కానీ మేమే ఎందుకిలా...తింటున్న కంచం మీదనుంచి లేచి డ్యూటీకి వెళ్లినా... ఏ రోజూ కష్టమనిపించలేదు కానీ...సమాజం కనీస మర్యాద ఇవ్వనప్పుడు వచ్చే కన్నీరు మీకెవ్వరికీ కనిపించదు...


ఎందుకంటే సమాజానికి ధైర్యం చెప్పాల్సిన నేను ఇలాంటి వాటికి బెదిరితే ఎలా...?


ఏం... మేము సమాజానికి సేవ చేయడం లేదా...
మేము ఆ గౌరవానికి అర్హులం కాదా...
డబ్బు లేకపోయినా ఆత్మగౌరవంతో బతకడం మా తప్పా...


 గొట్టాలెత్తుకుని వచ్చారు అని ఒకడంటే... ముఖం మీద చిరునవ్వు పులుముకుని పక్కకు వెళ్ళగానే మీ వెకిలి మాటలు చెవినపడుతూనే ఉన్నాయి... 


చివరికి #కరోనా కర్ఫ్యూ లోనూ అదే చిన్న చూపు...


ఊరంతా తిరిగి...ఆ మహమ్మారి ఎక్కడ సోకుతుందో అనే భయం లేకుండా... మాతో పాటు మా పెళ్ళాం పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టి... అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఇదే సమాజాన్ని ఇంట్లో కూర్చోబెట్టి సేవ చేస్తుంటే...


కనీసం మొన్న మీరు కొట్టిన చప్పట్లు.. తాళాలు.. చివరికి మీ వాట్సప్ స్టేటస్ లో విలేకరి పేర్లు మాత్రం లేవు. 


ఈ అవమానం చాలదన్నట్లు మళ్లీ లాఠీ దెబ్బలు


మీకో నమస్కారం...
మీరు కాదన్నా అవునన్నా మేము సమాజ సేవకులం...


ఆ విషయం బిడ్డకు జ్వరమొస్తే డ్యూటీలో ఉన్న భర్తను ఎందుకు కంగారు పెట్టడం అంటూ... ఆస్పత్రికి తానే ఒంటరిగా పరుగెత్తే భార్యకు తెలుసు...


రాత్రి ఏ సమయానికి డాడీ వస్తాడో తెలియక..అమ్మ చెప్పే మాయమాటలు నమ్మి సర్దుకుపోయి నిద్దురపోతున్న  బిడ్డకు తెలుసు...


కొడుకుని టీవీలో చూసి మురిసిపోవాలో... 
లేదా పొద్దటి నుంచి రోడ్డు మీదే ఉన్నాడు, తిన్నాడో లేదో అని ఏడ్చే మా అమ్మ నాన్న కి తెలుసు


మా అన్న జర్నలిస్ట్ అని పైకి గొప్పగా చెప్పుకుంటున్నా.. ఏ రకంగాను ఆదుకోలేని నా తమ్ముడికి తెలుసు... 


ఫోన్ చేసి సమస్యలు చెప్పుకునే చుట్టాలకు.. పాపం కర్ఫ్యూ కదా ఎలా ఉన్నాడో.. ఏం తింటున్నాడో.. ఒకసారి ఫోన్ చేద్దాం అనుకునే చుట్టాల కాల్స్ జాడ లేవు..


మామా నువ్ మీడియా కదా..  ఎక్కడైనా మందు బాటిల్ ఇప్పించు అని అడుగుతున్న దోస్తులున్నారు కానీ..
మామా.. జాగ్రత్తగా ఉండురా అని ఆ నోటికి రాదు.. 


*మేము సమాజాసేవకులం...!*
*మేమే అసలైన సేవకులం...!*