ఉచితంగా సరుకులు, కూరగాయల పంపిణీ

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో పర్యటించి, ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులతో పాటు, కూరగాయలు, నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. 


గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కాకాణి.


ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన నూతనంగా ఎంపికైన యం.పి.టి.సి. సభ్యులు ఉన్నం లక్ష్మి నారాయణ రెడ్డి ని అభినందించిన ఎమ్మెల్యే  కాకాణి.


కాకాణి పర్యటన సందర్భంగా సేవా కార్యక్రమాలకు లక్ష రూపాయల విరాళాన్ని అందజేసిన మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి.


నియోజకవర్గ స్థాయిలో రైతుల నుండి భారీ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నందున ధాన్యం తరలింపు, పంపిణీ కోసం వినియోగించు కోవల్సిందిగా మండల స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విరాళాన్ని అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.


మండలంలోని ప్రజలకు ఉచిత కూరగాయల పంపిణీ కోసం ఎమ్మెల్యే కాకాణి కి 50 వేల రూపాయల విరాళం అందజేసిన ఉన్నం ప్రకాష్ రెడ్డి.


ఉన్నాం  ప్రకాష్ రెడ్డి అందజేసిన విరాళాన్ని ఉచిత కూరగాయల పంపిణీ కోసం ఉపయోగించు కోవలసిందిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.


సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రకాష్ రెడ్డి కి , లక్ష్మి నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.