కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు డాక్లర్లు, పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఆరోగ్యకరమైన సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తోన్న డాక్టర్లకు సహకరించడం చాలా అవసరం. కరోనా లక్షణాలున్న వారిని తీసుకెళ్లేందుకు డాక్టర్ల బృందం వెళ్తే..వారిపై దాడులకు దిగుతుండటం దురదృష్టకరం.
కరోనా బాధితుల చేతిలో గాయపడిన ఓ మహిళా డాక్టర్ వీడియోను.. ఘర్ బైఠో ఇండియా హ్యాష్ ట్యాగ్ తో..ఆకాశ్ కాశ్యప్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు, డాక్లర్లు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు