భారదేశ ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ

భారదేశ ప్రధాన మంత్రికి బహిరంగ లేఖ


 
ప్రధాన మంత్రిగారు, 


నిజం చెప్పాలంటే మీ వాస్తవాలను కూర్చటానికి మీ చేతకానితనాన్ని గురించి చెప్పటానికి రెండో ఆలోచన చేయనక్కరలేదు.


మీ ద్వారా పబ్లిక్, ప్రైవేట్ రంగాలు రెండూ ఆర్థిక పతనానికి చేసుకొన్నాక -మీ ప్రభుత్వం ఇప్పుడు తనకు ముందుచూపు లేదని రుజువు చేసుకొన్నాక ఇప్పుడు బుర్ర కూడా లేదని నిరూపించుకొన్నది. 


నేను ఇలా ఎందుకు అంటున్నానో అనే దాని మీద చర్చ పక్కకు పెడితే, కరోన వ్యాధి విషయంలో మీ విధానం నాకు ఒక తేలికైన సూచికను ఇచ్చింది. 
ప్రపంచ విశేషాలను భారతదేశ ప్రభుత్వానికి తెలియ చేయటానికి దాదాపు 100 వివిధ రకాల జ్నాన విభాగాలు మీకు ఉన్నాయి. కరోనా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు.


చేతకాని హోమ్ మంత్రి అమిత్ షా కు ఇష్టమైన పదజాలం ‘క్రోనాలజీ’ (కాల నిర్ణయం చేస్తే శాస్త్రం) ప్రకారం అర్ధం చేసుకొందాం. (ఇప్పుడు అమిత్ షా అన్ని రకాలుగా కనిపించకుండా పోయినట్లు ఉన్నాడు) 


*WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) 2020 జనవరి 30న కరోనాను ప్రపంచ వైద్య అత్యవసరంగా ప్రకటించింది. అంతకుముందు కూడా ప్రభుత్వానికి కరోనా గురించి ప్రపంచంలో ఉన్న భీతి గురించి తెలుసు.*


ఫిబ్రవరిలో వూహాన్ నుండి రెండు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా 100 మంది భారతీయులను తరలించటానికి నువ్వు ఏర్పాట్లు చేశావు. ఏర్పాట్లను మెచ్చుకొన్నావు కూడా. అంతే కాకుండా నువ్వు 15 టన్నుల వైద్య సహాయాన్ని చైనాలోని వుహాన్ కు  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C17 ద్వారా పంపావు. ఆ విమానాలు తిరిగి వస్తూ 112మందిని వెనక్కి తెచ్చాయి. ఇదంతా ఫిబ్రవరి చివర్లో జరిగింది. అప్పటికి దాదాపు 1000మంది కరోనా పాజిటివ్స్ ప్రపంచమంతా ఉన్నారు.  ఇవన్నీ నీకు నేను గుర్తు చేస్తున్నాను.   


2001నుండి నీ దయలేని ప్రభుత్వం సంగతి తెలిసినా, ఈ కింది ఈవెంట్స్ భారతదేశ ఆదేశాల కింద 2020 ఫిబ్రవరిలో జరగటమే నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. 


2020 ఫిబ్రవరిలో జరిగిన భారీ ఈవెంట్స్ 


1. సూరజ్ కుంద్ అంతర్జాతీయ చేతిపనుల మేళా
2. కళా ఘోడ కళల పండగ 
3. సులా ఫెస్ట్ 
4. మతో నారాంగ్ ఫెస్టివల్ 
5. అదూర్ గజమేళ
6. ఉదయ్ పూర్ ప్రపంచ సంగీత పండగ 
7. ఆల్వార్ పండగ 
8. జైసాల్మర్ డిసర్ట్ పండగ 
9. తైపూయ మహోత్సవం 
10. మహీంద్ర బ్లూస్ ఫెస్టివల్ 
11. ప్రపంచ సూఫీ పండగ 
12. శేఖావతి హెరిటేజ్ పండగ 
13. ఏనుగుల పండగ 
14. పరియానాంపెట్ట పూరమ్ కత్తకుళం
15. భారత కళల పండగ 
16. తాజ్ మహోత్సవ్ 
17. కోణార్క్ పండగ 
18. నాట్యాంజలి నృత్య పండగ 
19. మహా శివరాత్రి 
20. గోవా కార్నివాల్ 
21. లొసర్ పండగ 
22. ఖజురహో డాన్స్ పండగ 
23. నాగౌర్ పండగ 
24. ప్రపంచ పవిత్ర ఆత్మల పండగ 
25. డెక్కన్ పండగ 
26. హంపీ పండగ 


ఇవన్నీ కాకుండా 


లక్నో లో జరిగియన్ డెఫ్ ఎక్ష్పో,  మీ పార్టీ ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం కూడా ఉన్నాయి.


ఒక్క ఫిబ్రవరిలోనే 27 పండగలు జరిగాయి. వాటిల్లో మిలియన్ల కొలది భారతీయులు పాల్గొన్నారు. వారితో పాటు విదేశస్తులు కూడా. 
 
అది కాకుండా తక్కువలో తక్కువ 2000 మంది పాసింజర్లు భారతదేశానికి రోజు వస్తారు. అంటే ఒక్క ఫిబ్రవరిలోనే 55000మంది పరీక్షలకు గురికాని భారతదేశ పరిధిలోని మానవులు వచ్చారు.  


లాక్ డౌన్, అది జరిగిన పద్దతిలో చూస్తే, పూర్తిగా అంగీకరించలేనిది. ఫిబ్రవరిలోనే దాన్ని మొదలు పెట్టి ప్రణాళికలు వెయ్యాల్సింది.  నిజంగా నువ్వు విఫలం అయ్యావు. ఎందుకంటే నీకు ముందుచూపు, ఐడియా, క్లూలు లేవు. నువ్వు ప్రచారాన్ని అమ్మకానికి ఉపయోగించుకొనే  బీజేపీ పార్టీకి మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ మాత్రమే.   


మిస్టర్. ప్రైమ్ మినిస్టర్ 


భారత లాక్ డౌన్ అని పిలిస్తున్న ఈ పేద్ద తప్పులతో కూడిన ఉత్పాదానికి నువ్వే పూర్తిగా బాధ్యుడివని తెలుసుకొన్నావా? నువ్వు ఒక నెల కంటే ఎక్కువ కాలం అకారణంగా నిద్ర పోవటం వలన ఇది జరిగిందని ఒప్పుకొంటావా?


నా అభిప్రాయం నీకూ, నీ మద్దతుదారులకూ, భారత ప్రభుత్వానికీ ఎంతవరకు పడుతుందో నేను పట్టించుకొను. నాకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఈ సారి నేను నీ నాటకాలను ఎత్తిచూపించటం మాత్రమే తెలుసు. నువ్వూ, నీ మంత్రులూ వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రాష్ట్రపతికి అందించమని నా వినయపూర్వక అభ్యర్ధన. ఇలాంటి విషయాల్లో నిద్రపోయే మనిషి పాలనలో ఉండటానికి అర్హుడుకాదని గుర్తు పెట్టుకో.  


ఉదాహరణకు, FDA అనుమతి ఇచ్చిన ఒక ఆహార నిర్వహణ కంపెనీ ఇదే పని చేస్తే, దాని మేనేజర్ తప్పు  వందలాది ప్రాణాలను ప్రమాధంలో పడవేస్తే, అతని నిర్లక్ష్యానికి క్రిమినల్ కేసు కింద బుక్ చేస్తే జైల్లో వేసేసి ఉండేవారు ఈపాటికి. 


నీ తప్పు నీకు తెలియకపోతే, మేము నీకు తెలిసేటట్లు చెబుతాము. ఇది ఒక సూచనప్రాయమైన ఆలోచన. 
అయినా ఈ లేఖ చట్టవిరుద్ధమైతే, నేను కోర్టు విచారణకూ సిద్దమే. 


కానీ ఇప్పుడు, నీ జోళే తీసుకొని వెళ్లిపో. భారతదేశానికి నువ్వూ, నీ గాంగ్ అక్కరలేదు. మేము బాగానే ఉన్నాము. నువ్వు లేకపోతే ఇంకా బాగుంటాం.