కరోనా కట్టడికి స్వీయ నియంత్రణనే మార్గం’

‘కరోనా కట్టడికి స్వీయ నియంత్రణనే మార్గం’
గుంటూరు : స్వీయ నియంత్రణ ద్వారానే కరోనావైరస్‌ను నియంత్రించగలమని, ప్రజలు అది అర్థం చేసుకొని లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంచి సహకరించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు, వైద్య, రెవెన్యూ ఇలా అన్ని శాఖలు కరోనా కట్టడిడి అహర్నిశలు కష్టపడుతున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు కావాల్సింది రాజకీయమే కానీ, ప్రజల బాగోగులతో ఆయనకు పనిలేదని విమర్శించారు. ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోయి.. హైదరాబాద్‌లో ఉండి వాలంటీర్లపై తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను చైతన్య పరచడంలో వాలంటీర్లు కీలక పాత్ర పొషిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఇక్కడి వచ్చి ప్రజల్లో తిరిగితే వాస్తవాలు ఏంటో తెలుస్తాయన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. నిరుపేదలకు రేషన్‌, రూ. వెయ్యి సాయం చేశామని గుర్తుచేశారు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌