జర్నలిస్టూ.. మీరు చేసిన కష్టమెంత...? కరోనా మీద వార్తలు రాసింది ఎంత... ?

ఓ జర్నలిస్టూ..... నీ వాటా ఎంత...?
మీరు చేసిన కష్టమెంత...?
కరోనా మీద వార్తలు రాసింది ఎంత... ?
కరోనా కోసం మీరు చేసిన యుద్దమెంత......?
మీలో ప్రాణాలకు తెగించి వార్తలు రాసినవారెంత మంది..?
ఎమ్మెల్యే గారి దగ్గర ఆర్ధిక సహాయం తీసుకునే అర్హత మీకుందా....?


ఇందుకోసమేనా నిన్నటిదాకా బిన్నమైన గ్రూపులు కట్టింది..
ఈ డబ్బుల కోసమేనా సాటి జర్నస్టులను జర్నలిస్టులు కాదంటూ ముద్ర వేసే కుట్ర చేసింది...
ఈ డబ్బుల కోసమేనా ఎమ్మెల్యే గారి దగ్గర మెప్పు పొందడం కోసం నాయకత్వాలు.......మార్పులు చేర్పులు చేపట్టినది.
ఎమ్మెల్యే గారు నేను ఎంత చెబితే అంతే అంటూ ఒకరు...
మా నాయకత్వంలోకి రండి.....
ఎమ్మెల్యేలు మారినా మా ఆధిపత్యమే కొనసాగుతుందని మరొకరు.....
దీని కోసం ఒకరు వాట్సప్ గ్రూపు క్రియేట‌్ చేసి అధికారులను యాడ్ చేస్తారు...
మరొకరు గ్రూపు క్రియేట‌్ చేసి కొందరు జర్నలిస్టులను మాత్రమే యాడ్ చేస్తానంటారు..
మీ మాటను దిక్కరిస్తే వారికి అక్రిడిటేషన్ లేదంటూ వారిని విలేఖరులు కాదంటారు.... కొందరిని నాన్ లోకల్ జర్నలిస్ట్ అంటారు.
అక్రిడిటేషన్ ఉన్నవారు రోడ్డెక్కి వార్తలు రాసినవారెంత మంది....
అక్రిడిటేషన్ లేక పోయినా వెబ్ చానల‌్ లో అయినా కూడా వార్తలు రాసిన వారెంతమంది....?
మొత్తానికి అనుకున్న స్కెచ్ ప్రకారంగా ఎమ్మెల్యే గారి వద్దనుండి ఆర్ధిక సహకారం పేరుతో 75 వేలు తీసుకొని మీ పంతం నెగ్గించుకున్నారు. దీనిని చూపించి వసూల్ రాజలు బయదేరుతారు. ఇక పంపకం మొదలు పెట్టండి.


ఒక జర్నలిస్టు ఎక్కడైనా బ్లాకుమెయిల్ కు పాల్పడితే సంభందిత శాఖాధికారులు గాని , పోలీసులు గాని చర్యలు తీసుకుంటారు.... 
అంతే కాని వారు జర్నలిస్టులు కాదు, వీళ్లు జర్నలిస్టులు కాదు అనడానికి మీరెవరు....? 
మీకేమి హక్కు ఉంది....?
ఎవరు జర్నలిస్టు , ఎవరు కాదనే నిర్ణయాలు చూయడానికి మిమ్మల్ని ఎవరైనా నియమించారా...?
ఇంకా ఎంతకాలం మీ కుట్రలు, కుతంత్రాలు....


గతంలో మంత్రి పేరు చెప్పుకుని లక్షలాది రూపాయల సెటిల్ మెంటులు చేసుకుని సంపాదించుకుని.....
మేము చెప్పిందే వేదవాక్కు అని ఆధిపత్యం చేసిన బ్యాచ్...
మళ్లీ స్థానిక ఎమ్మెల్యే దగ్గర తమ పంతం నిరవేర్చుకోవడం కోసం....
వ్యూహాత్మకంగానే  పావులు కదుపుతూ....తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ....
స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కోవర్టులను రెడీ చేస్తున్నారు. సిగ్గుగాలేదా...? 


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 
ఒక అభాగ్యురాలిని కొందరు రాక్షస మూకలు భలవంతం చేయజూస్తే....
గతంలో ఇక్కడ పనిచేసిన మంత్రి పేరు చెప్పుకుని 
ఆ రాక్షస మూకలను కాపాడడానికి....
ఆ అభాగ్యురాలి ఆత్మాభిమానాన్ని కూడా బేరమాడిన వారు నేడు అక్రిడిటేషన్, నాన్ అక్రిడిటేషన్ అంటూ మాట్లాడే స్థాయికి వచ్చారు అంటే ఆశ్చర్యకరంగా ఉంది...
అంతటి గాతుకాలకు పాల్పడి కనీస మానవత్వపు విలువలకు నీళ్లు వదిలిన  వీరు జర్నలిస్టుల విలువల గురించి  మాట్లాడుతుంటే.. అసహ్యంగా ఉంది.


విలుకరిమంటూ తహసీల్దరు కార్యాలయాలలో 1బి, అడంగల్, పాససుపుస్తకాలు ఇప్పిస్తూ.....
రిజిస్ట్రేషన్ల కోసం ఆర్.ఎస్. నెంబర్లు మార్పింగులు చేయించి డబ్బులు దండుకున్న వారు కూడా ...
నేడు జర్నలిస్టుల గురించి నీతులు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..


విలేకరులందరూ నా కనుసన్నల్లోనే ఉన్నారంటూ .....
కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాను తన గుప్పిట్లో పెట్టుకుని ..... ప్రతీ ఒక్కటి నాకే సమాచారం ఉందంటూ....
ప్రతీ ఒక్కరూ నా మటే వింటారంటూ ... కంపెనీల అధినేతల వద్ద నుండి లంచాలను బాహాటంగానే తీసుకుంటున్న వ్యక్తులు..
ఈ రోజు జర్నలిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది..


మండలంలో నీతిగా ఏ వ్యక్తి మాట్లాడినా.....తప్పును ప్రశ్నించినా...
ఒక విలేఖరి నిజాయితీగా వార్త రాసినా.....
గత టీడిపి హయాంలో నేరు గా వీరే రంగంలో దిగడం.... వారిని బెదిరించడం.... వారిపైన కేసులు పెట్టించడం.....
నేడు తమ అనుచర వర్గం ద్వారా అన్నింటిని వెనుండి నడుపుతూ......కుట్రలకు, కుతంత్రాలకు పాల్నడుతున్న వీరా జర్నలిస్టుల గురించి, విలువల గురించి మాట్లాడేది..