కరోనావైరస్( కెవిడ్ 19) నియంత్రణ  ప్రతి ఒక్కరి భాద్యత

కరోనావైరస్( కెవిడ్ 19) నియంత్రణ  ప్రతి ఒక్కరి భాద్యత


డోన్ పట్టణం  డోన్  ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంటు డాక్టర్ వై. శ్రీనివాసులు సార్, డోన్ మున్సిపల్ కమీషనర్  కె యల్ యన్ రెడ్డి సార్ గార్లు  విడుదల చేసిన కరోనా వైరస్ (కోవిడ్ 19) కరపత్రాలను ప్రజలకు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి అందజేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  మన కర్నూల్ జిల్లాలో  కరోనా పాజిటివ్  కేసులు పెరుగుతున్నా నేపథ్యం లో మన డోన్ పట్టణంలో ఒక ( 01 ) కరోనా కేసు నమోదు అయినది.  కావున  అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదు.  డోన్ పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్(రెడ్ జోన్) గా ప్రకటించారు....
కావున ప్రజలందరూ మన ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే  బయట తిరగకుండా ఇంటిలోనే వుండాలి. లాక్ డౌన్ కచ్చితంగా పాటించండి. అలాగే ఇంటి దగ్గర సందుల్లో గుంపులు కుర్చోరాదు. వైద్య  అవసరమై బయటికి వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించండి. మనిషికి మనిషికి 5 అడుగులు దూరం పాటించండి.మన డోన్ పట్టణాన్ని, మన సమాజాన్ని  కరొనా బారిన పడకుండా చూడవలసినభాద్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి సూచించారు.