ఎల్లప్పుడూ తమ విధుల్లో కఠినంగా కనపడే ఖాకీల వెనకాల కూడా మానవత్వం దాగుంటుందని నిరూపించుకున్న
పోలీసు శాఖ
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేస్తున్న కూడా ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని పెనుకొండ CI శ్రీహరితో పాటు స్థానిక SI వెంకటరమణ శాలువా కప్పి పూలహారం వేసి 5 రకాల పండ్లు,కేజీ చికెన్ నిత్యావసర సరుకులిచ్చి ఘనంగా సత్కరించారు.
కరోనా మహమ్మారి తో భయపడి అందరూ ఇళ్లలో ఉంటే జీతం తక్కువ ఉన్నా, ప్రజలు తమను గుర్తించకుండా ఉన్న, ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.
సోమందేపల్లి పోలీస్ సిబ్బంది. సోమందేపల్లి గ్రామంలో లాక్ డోన్ సమయం నుండి ప్రతి రోజు గ్రామాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది కి ఎటువంటి రక్షణ పరికరాలు లేకున్నా పని చేస్తున్నారు, వారిని గమనించిన సోమందేపల్లి SI, పోలీస్ సిబ్బంది వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలని వారు చేస్తున్న శ్రమను గుర్తించి పెనుగొండ సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో వారిని పూలదండలతో మరియు శాలువాతో ఘనంగా సత్కరించి, అయిదు రకాలైన పండ్లను, కేజీ చికెన్ ను పోలీసులు తమ జీతంలో నుంచి కొంత సొమ్మును కేటాయించి వారికి అందజేశారు.
పారిశుద్ధ కార్మికులు చేస్తున్న కృషికి తాము ఇస్తున్న సహాయం చిన్నదని, రాబోయే రోజుల్లో మరింతగా పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోమందేపల్లి ఎస్సై వెంకటరమణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పాల్గొన్నారు.