20 నుండి ఎన్నారై వైద్యశాలలో టెలీ మెడిసిన్ సేవలు.
ఈనెల 20వ తేదీ నుండి మంగళగిరి మండలం చిన్నకాకాని లోని ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ జనరల్ & సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు టెలీ మెడిసిన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్నారై మెడికల్ సూపరిండెంటెంట్ మస్తాన్ అన్నారు. శనివారం చిన్నకాకాని ఎన్నారై కళాశాల ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుండి ఆసుపత్రి ఆధ్వర్యంలో టెలి మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు ఉదయం 9గంటలనుండి సాయంత్రం 4గంటల వరకు *9959094888 లేదా 08645-230101* నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యను తెలిపినట్లయితే సంబంధిత నిపుణులతో నేరుగా మాట్లాడించి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైతే మందులను డోర్ డెలివరీ చేస్తామని అన్నారు.
కరోనా మహమ్మారి అరికట్టేందుకు భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా బడుగు, పేద, రోజువారి కూలీలు, వలస కార్మికులు ఆకలితో అలాంటిస్తున్నారని వారి ఆకలిని దృష్టిలో ఉంచుకుని ఎన్నారై యాజమాన్యం అక్షయపాత్ర సహకారంతో ఏప్రిల్ 7వ తేదీ నుండి 16 వతేదీ వరకు మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 7వేల మందికి నిర్వహించినట్లు తెలిపారు. అలానే ఎన్నారై లో విధులు నిర్వహించే సిబ్బందికి మూడు వారాలకు సరిపడా నిత్యావసరాలను అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 20 నుండి ప్రారంభమవుతున్న టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మెడికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ మురళి వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. లక్ష్మీ, వైద్యశాల వైద్యులు, ఆసుపత్రి అడ్మిన్ భగవాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.