జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసుల్లో 11 కేసులు కర్నూలు

కర్నూలు:


జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసుల్లో 11 కేసులు కర్నూలు నగరంలో ఉన్నాయి. 


కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్ ప్రెస్ మీట్.. కామెంట్స్.. 


 జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసుల్లో 11 కేసులు కర్నూలు నగరానికి చెందినవి..


జిల్లాలో వచ్చిన 27 పాజిటివ్ కేసుల్లో 26 కేసులు ఢిల్లీ నిజముద్దీన్ జమాత్ కువెళ్లివచ్చిన వారే..


పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాము..


పాజిటివ్ కేసుల వారిని వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసాం..


పాజిటివ్ వచ్చిన వారు ఎవరెవరితో  ఇంటరాక్ట్ అయ్యింది ఆరా తీసి, వారందరి వివరాలు సేకరిస్తున్నాం..


పాజిటివ్ కేసులు పెరుగుతున్నాడుకు ప్రజలు భయపడవలసిన అవసరం లేదు..


స్వీయ నియంత్రణ పాటించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ను నియంత్రించవచ్చు..


ప్రజలు వదంతులు నమ్మవద్దు.. అనుమానాలు ఉంటే కాల్ సెంటర్కు ఫోన్ చెయ్యాలి..


జిల్లాలో ఉన్న శాంతిరామ్ హస్పెటల్,విశ్వభారతి హస్పెటల్ ను పూర్తి స్థాయిలో కోవిడ్- 19 ఆస్పత్రులుగా మార్చడం జరిగింది..


ఇవికాక మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు కృషి చేస్తున్నాం..