ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కూల్ డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్న వ్యాపారికి కోదాడ మున్సిపల్ అధికారులు రూ.25 వేల జరిమానా విధించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన కేశవరావు మండల కేంద్రం నుంచి గ్రామాలకు కూల్‌డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో సరఫరా చేయొద్దని హెచ్చరించినా వినకపోవడంతో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి గురువారం రూ.25 వేల జరిమానా విధించారు.
రూ.25 వేల జరిమానా