తెలంగాణలో ఈనెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

 


తెలంగాణలో ఈనెల 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్


ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ఈ 15 రోజులు పాటు ఎక్కడివారు అక్కడే ఉండాలని అన్నారు. ఆ తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని తెలిపారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.