విజయవాడ :
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు
చిన్న దేవాలయాలలో పనిచేసే అర్చకుల కోసం ఒక్కొక్కరికి 5000 రూపాయల గ్రాంటు
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏప్రిల్ 14 వరకు దేవాలయాలలో భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగింది. కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
చిన్న దేవాలయాలలో అర్చకులు ఎటువంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
“ధూప దీప నైవేద్యం” మరియు “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా 2800 పైగా అర్చకులకు లబ్ది చేకూరుతుంది. ఈ రెండు పథకాల లోను లేని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది దాకా ఉంటారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదన చేయబడింది.
ఏ పథకం క్రింద లబ్దిచేకూరని అర్చకులకు “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా ఒక్కొక్కరికి 5000 రూపాయల గ్రాంటు మంజూరు చేయబడుతుంది.
దీని వలన “అర్చక వెల్ఫేర్ ఫండ్” పై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడుతుంది.