కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో 970

గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో 970కి చేరిందన్నారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 693గా ఉన్నట్లు తెలిపారు. వ్యాధి భారి నుంచి కోలుకుని ఇవాళ 58 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. కాగా మొత్తం ఇప్పటి వరకు 262 మంది డిశ్చార్జీ అయినట్లు చెప్పారు. కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని మంత్రి తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 9 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు.