మచిలీపట్నంలో తొలి కరోనా పాజిటీవ్ కేసు

కృష్ణా జిల్లా :


మచిలీపట్నంలో తొలి కరోనా పాజిటీవ్ కేసు...


ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో కలకలం సృష్టించిన  కాంటాక్ట్ కరోనా పాజిటీవ్ కేసు..


పాజిటీవ్ కేసుతో ఉలిక్కి పడ్డ నగర వాసులు...


చిలకలపూడికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ...


జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అందిన రిపోర్ట్...


ఎవరి నుండి కరోనా సంక్రమించిందో తెలియని అయోమయ పరిస్థితి...


చిలకలపూడి ఏరియాను కంటైనమెంట్ జోన్ గా ప్రకటించిన  అధికారులు..


ఓ రోల్డ్ గోల్డ్ పరిశ్రమలో పని చేస్తున్న పాజిటీవ్ వచ్చిన వ్యక్తి....


అతనితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్న అధికారులు...


కుటుంబ సభ్యులను కోరంటైన్ కు తరలింపు...


సదరు వ్యక్తికి ప్రైవేట్ గా చికిత్స చేసిన నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు, అతని భార్య స్వీయ నియంత్రణకు తరలింపు...


రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించిన మంత్రి పేర్ని నాని...


రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేసిన మంత్రి పేర్ని నాని...


పాలతో పాటు నిత్యావసరాలన్నీ ఇంటింటికి సరఫరా చేసేందుకు  చర్యలు...


4, 5, 6, 7, 8, 9, 10 డివిజన్లతో పాటు నవీన్ మిట్టల్ కాలనీ, హమాలీ కాలనీ, సీతయ్య నగర్ రెడ్ జోన్ గా ప్రకటించింది 


*మంత్రి పేర్ని నాని కామెంట్స్...*


*పాజిటీవ్ వచ్చిన వ్యక్తితో సంబంధాలు ఉన్న వారంతా హౌస్ ఐసోలేషన్ లో ఉండాలి*


*ఏమైనా లక్షణాలు బయటపడితే వెెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలి*


*ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాలని పదే పదే కోరుతున్నా కొంత మంది పట్టించుకోకపోవడం బాధాకారం*


*ఇప్పటికైనా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి*


మేము చెప్పేది మీ మంచి కోసమేనని తెలుసుకోవాలి.


కర్ఫ్యూ సందర్భంగా వార్డు వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికే నిత్యావసరాలు పంపిణీ చేయిస్తాం.