దేశీయ వైద్యం ఓ నైవేద్యం.

దేశీయ వైద్యం ఓ నైవేద్యం


ప్రపంచానికి నాగరిత, సంస్కృతి, వైద్యం, ఖగోళ, శాస్త్రీయత నేర్పింది సగర్వ భారతదేశం. ఇక్కడ క్రీస్తు పూర్వం 7000 నుండి మధ్య యుగం క్రీ.పూ. 500 ఎన్నో విశిష్టతలను ప్రపంచానికి పరిచయం చేసింది. అసలు ఈ కాలాలకు ముందు ప్రాచీన భారతదేశం చరిత్ర ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కాబట్టి భారతచరిత్ర కాల నిర్ణయం అంతకంటే ముందే ఉంటుందని భారతీయుల విశ్వాసం. ఇప్పుడు కరోనా కోరల్లో విల, విలలాడుతున్న 'రోగ ప్రపంచానికి' భారత్ పెద్ద దిక్కుగా నిలవనుంది. ఇందుకోసం అమెరికా, పాశ్చాత్య దేశాల్లో కరోన కట్టడికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో తెలిస్తే భారతీయ మేథస్సు ఎంత గొప్పదో తెలుస్తోంది. చెన్నైలో 'నేలవేప కషాయం', 'కబుసర కషాయం'లు అందిస్తంన్నారు. 'ఆదాబ్ హైదరాబాద్' ప్రత్యేక కథనం._*


*చెన్నైలో 'నేలవేప' కషాయం:*
హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి ‘నేలవేప’ కషాయం అందజేస్తున్నారు. కరోనా అనుమానితులకు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి 10 రోజులపాటు ఇలా అందించడానికి ఏర్పాట్లు చేశారు. దీని గురించి వైద్యులు మాట్లాడుతూ.. పర్యవేక్షణలో ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో 5 గ్రాముల చొప్పున నేలవేప చూర్ణాన్ని తీసుకుని 200 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి వేడి చేసి చల్లార్చి తాగవచ్చని చెప్పారు. కరోనా నుంచి ముందుగా రక్షణ పొందడానికి ప్రజలు కబసుర పొడి కలిపిన నీరు తాగవచ్చని, సిద్ద వైద్య ఆస్పత్రులలో ఈ పొడిని ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


*పోలీసులకు కబసుర కషాయం పంపిణీ:*
కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు 24 గంటలు విధులు, షిప్టు పద్ధతిలో మాస్కులతో బందోబస్తులో పాల్గొంటున్నారు. వీరు వ్యాధుల బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి రాణిపేట మూలక్కడై పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో తులసి, ఇతర ఔషధ మూలికలతో తయారుచేసిన 'కబసుర కషాయం' అందజేస్తున్నారు. రాణిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మయిల్‌ వాణన్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ కషాయం అందజేశారు. పోలీసులకు కబసుర కషాయం పంపిణీని కాంచీపురం డీఐజీ తేన్‌ మొళి ప్రారంభించారు. సిబ్బందితో కలిసి ఆమె కూడా తాగారు.  ‘కబసుర’ కషాయాన్ని పోలీసులకు చెన్నై నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథన్‌ స్వయంగా పంపిణీ చేశారు.


*అమెరికా 'వేప' చూపు:*
అమెరికా వాడి చూపు మన వేప, పసుపుపై పడింది. 'వీటి హక్కులు మావే' అంటూ పేటెంట్  హక్కుల కోసం అమెరికా తెగపడింది.
గత దశాబ్దమంతా...(1995 – 2005) భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం, మేధావి వర్గం, అమెరికా పేటెంట్ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞానయుద్ధాలు చేసారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం అనూచానంగా భారతదేశమంతటా ఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్లు వారికి నిరూపించడానికి తలప్రాణం తోకకొచ్చింది.


*వేప, పసుపే కాదు...:*
నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేద ఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరికి బాసుమతి బియ్యం కూడా పేటెంట్ చేసుకొని ఉన్నారు. తాజాగా కరోనా కట్టడి కోసం భారతీయ గ్రంథాలలో ఉన్న అనేక పురాతన మూలికా రహస్యాల కోసం వెతుకులాట మొదలైంది. అమెరికా తన శాస్త్రవేత్తలకు భారతీయ పురాతన గ్రంథాలను, వాటిలోని మూలికా విషయాలపై.. ప్రత్యేకంగా 'వేప' గురించి వెతుకులాట చేస్తుంది.