*ధాన్యం రైతులను ఎవ్వరు అదైర్యపడవద్దు*
తక్షణమే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు
మంగళవారం సాయంత్రం మైలవరం పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి కల్లాలో, మార్కెట్ యార్డు ఆవరణలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం వలన ధాన్యం తడిచిపోగా స్పందించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు గారు (నాని) జాయింట్ కలెక్టర్ మాధవీలత గారి తో ఫోన్ లో మాట్లాడి అకాల వర్షం వలన పరిస్థితి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి నాని గారు అధికారులకు తగు సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. తడిచిన ధాన్యాన్ని తక్షణమే కోనుగోలు చేసి అక్కడ నుండి తరలించడం జరుగుతుందని జెసి గారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి కి తెలిపారు. బుధవారం ఉదయం తడిచిన ధాన్యం రాశులను పరిశీలించేందుకు అధికారులు బృందం మైలవరం వస్తుందని రైతులు ఎవరు భయపడవద్దని ప్రతి గింజల కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు తెలిపారు.
బుధవారం ఉదయం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు స్వయంగా దగ్గరుండి తడిచిన ప్రతి ధాన్యం గింజ ను కోనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటారు. రైతులు ఎవ్వరు కూడా అదైర్యపడవద్దని తెలిపారు