కరోనా వల్ల పాపం పెట్టుబడిదార్లకు కూడా కష్టమే కదా...

కరోనా వల్ల పాపం పెట్టుబడిదార్లకు కూడా కష్టమే కదా...  
వాళ్ళకు కూడా ఇబ్బందే కదా...
అనుకోకండి. ఇలాంటి సమయాల్లో వారేం చేస్తారు? 
వారు అంటే వారి ప్రయోజనాలు కాపాడే వ్యవస్థ ఏం చేస్తుంది ?
కనీసం ఈ మూడు విషయాలు చేస్తుంది. ఆల్రెడీ ఆ దిశగా పని మొదలైంది. 
ఏమిటవి ?
1). చరిత్రలో మనం ఎన్నడూ కనీవినీ ఎరగనంత స్థాయిలో రాజ్యం అధికారాన్ని తన చేతిలో కేంద్రీకృతం చేసుకుంటుంది. దాదాపు పౌరసమాజం , సమాజం ( ఇవి రెండూ వేరు వేరు) రాజ్యం నియంత్రణలోకి వెళ్ళిపోతాయి.
2). కంటికి కనిపించకుండా, ఎలాంటి ప్రజాస్వామిక ప్రక్రియల బాదరాబందీ లేకుండా( అంటే పబ్లిక్ డిబేట్ ,పార్లమెంటరీ డిబేట్ etc...) విధాన నిర్ణయాలు తీసుకోబడతాయి. సంక్షోభం ఎదుర్కోవడం పేరుతో గుట్టు చప్పుడు కాకుండా పెట్టుబడిదార్లకు అనుకూలంగా ఆటనియమాలు మార్చేయబడతాయి. పారదర్శకత ,జవాబుదారీ తనం అన్నవి కనీసం నామ్ కే వాస్తే కూడా కనిపించకుండా పాతాళంలోకి తొక్కేయబడతాయి.
3). పెట్టుబడిదార్ల నేరాలూ ,బాధ్యతారహితమైన లాభాల దురాశతో వారు చేసిన అక్రమాలూ శాశ్వతంగా సమాధి చేయబడతాయి. సంక్షోభ అనంతర ప్రపంచంలో తాజాగా శ్రామికుల రక్తం పీల్చడానికీ ,యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికీ రంగం సిద్ధం చేయబడుతుంది.