ఏపీలో కరోనా తొలి మరణం
గత నెల 30వ తేదీన కరోనా లక్షణాలతో మృతి చెందిన విజయవాడ వాసిది కరోనా మరణమే.
అధికారికంగా ప్రకటించిన కరోనా స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. అర్జా శ్రీకాంత్.
మృతుడు కరోనా లక్షణాలతో గత నెల 30వ తేదీన ఆస్పత్రికి రాగా గంట వ్యవధిలోనే కరోనా లక్షణాలతో మృతి.
దీని పై విచారించగా మృతుడు కుమారుడు మార్చి 17వతేదీన ఢిల్లీ నుండి వచ్చినట్టు గుర్తించిన అధికారులు.
మృతుడి కుమారుడిని పరీక్షించగా కరోనా పాజిటీవ్ రిపోర్ట్ రావటంతో కొడుకు నుండి తండ్రికి వ్యాప్తి చెందినట్టు తెలిపిన అధికారులు.