విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు బాదంపాలు పంపిణీ.

 


లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు బాదంపాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నార్త్ జోన్ ghmc కార్యాలయం వద్ద సినీ దర్శకులు శేఖర్ ఖమ్ముల ఆధ్వర్యంలో లాక్ డౌన్ ముగిసే వరకు నార్త్ జోన్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ప్రతిరోజూ 1000 మందికి బాదం పాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న వారికి దాతలు అందిస్తున్న చేయూత ఎంతో స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు. పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బాదంపాలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శకులు శేఖర్ ఖమ్ముల ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, పద్మారావు నగర్ trs ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్,  కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, మహంకాళి acp వినోద్, dmc ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.