రాజకీయ నాయకులారా ఓటు రాజకీయాలు మానండి.

రాజకీయ నాయకులారా ఓటు రాజకీయాలు మానండి


.ప్రజలకి చేటు చేయకండి మీరు చూపుతుంది పేదలపై కరుణ కాదు పంచుతుంది కరోనా అని గుర్తుంచుకోండి   కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు  కిలో ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్లో రూ 250 అమ్మినప్పుడు ఎవ్వరు నోరు మెదపలేదు  ప్రభుత్వం రైతు బజారుల్లో కిలో ఉల్లిపాయలు రూ 25 కి అమ్మినప్పుడు  రోజువారీ కూలీలు గంటలు తరబడి కిలోమీటర్ల దూరంలో క్యూ లైనులో నిలబడ్డప్పుడు ఏ నాయకుడూ ముందుకొచ్చారా......... ఆనాడు ఉల్లిపాయలు ఉచితంగా పంచడానికి ఎవ్వరి మనస్సు అంగీకరించలేదు    ఆనాడు పేదలపాట్లు.  పట్టించుకొన్ననాధుడు లేడు  కేవలం రూ 200 విలువైన  కూరగాయలు పంచుతూ  దేశోద్ధారకుల్లా ఫోజులిస్తున్న  కొందరు తాము కూరగాయలతో పాటు కరోనాని పంచుతున్నామనే  విషయాన్ని విస్మరిస్తున్నారు ......రాష్ట్రంలో కూరగాయల సాగు బాగుంది   లాక్ డౌన్ వల్ల పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం లేదు .... ... రైతులకు ఎక్కువ ధరకు అమ్ముకొని అవకాశం లేదు.... చేతికొచ్చిన పంట మనరాష్ట్రంలోనే ......అమ్ముకోవాల్సిందే  కనుక  కూరగాయల ధరలు పేదవారికి అందుబాటులోనే ఉన్నాయి......... నేడు  టమోటా కిలో  కేవలం రూ 14 లకే లభిస్తున్నాయి వంకాయలు కిలో రూ 18,  బెండకాయలు కిలో రూ 18,   పచ్చి మిర్చి కిలో రూ 14,   దోస కిలో రూ 16,  క్యాబేజీ కిలో రూ  12, బంగాళాదుంపలు  కిలో రూ 27,  దొండకాయలు కిలో రూ 20,   సొరకాయ ఒక్కటి రూ 10,  చిక్కుళ్ళు కిలో రూ 24,   ఉల్లిపాయలు కిలో రూ 25,   మాత్రమే ఇలా దాతలు అందిస్తున్న  మొత్తం కూరగాయలు  రూ. 200 లు దాటదు  కేవలం రూ 200 విలువైన వాటి కోసం జనాలు  ఎగబడుతున్నారు  తోపులాట జరుగుతుంది  వారి  నియంత్రణ సాధ్యమా ....... కొన్నిచోట్ల బలప్రదర్శనగానే  గోచరిస్తుంది ........సామాజిక దూరం   సామాజిక బాధ్యత గుర్తుకు రావడంలేదు   రాను రాను దేశంలో ,రాష్ట్రంలో ,నగరంలో  కరోనా కేసులు గణనీయంగా  పెరుగుతున్నాయి  ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని  అధికారులు నెత్తి నోరు మొత్తుకొంటున్నా  ఎవ్వరి బుర్రలూ పనిచేయడంలేదు   అయ్యా రాజకేయ నాయకులారా ... డివిజన్ కార్పొరేటర్లుగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లారా......... మీకు  నిజ్జంగా  సమాజ సేవ చేయాలని ఉంటే  .... వాడు ఓటరా కాదా అని ఆలోచనలు పక్కన పెట్టి కూరగాయలు తప్ప  ఇంకా ఇతర నిత్యావసర సరుకులను  నిజమైన నిరుపేదలకు అందించండి .....  విజయవాడలో వేల్లంవెర్రిగా ....ప్రతి డివిజన్లలో  కూరగాయలు పంచుకొంటూ పోతున్నారు  సామాజిక దూరం నిబంధనలు  తూట్లు పొడుస్తున్నారు...   బడులు.... గుడులు ... మసీదులు ...చర్చిలు ......మూతబడ్డాయన్న  విషయాన్ని విస్మరిస్తున్నారు .... .. ఇప్పటికయినా     మారండి ........భారమే ఐనా తిండి గింజలు అందించండి...... అదీను  గుంపులు గుంపులుగా  గాకుండా  ఒంటరిగా వెళ్లి అందించండి......  కరోనా కోవిడ్ 19  కష్ట కాలం నుండి ప్రజలను కాపాడండి .