ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగి సభ

  
           శ్రీ బాబాసాహెబ్ అంబెడ్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు అనగా 14.04.2020 ఉదయం 10.00 లకు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగి సభకి ముఖ్య అతిథిగా మన మెజిస్ట్రేట్ శ్రీ వి గోపాలకృష్ణ గారు హాజరై అంబెడ్కర్ చిత్రపటానికి పూల మాల వేసి, అంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ  మన రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ స్వాతంత్ర భారతావని ప్రధమ న్యాయ శాఖ మంత్రి గా పనిచేసి, అణగారిన భారత ప్రజల కోసం జీవితం అంకితం చేసిన మహనాయకుడు అని కొనియాడారు.  అణగారిన ప్రజల కోసం రాంజ్యాంగం ద్వారా రిజారేషన్లు కల్పించి వారి అభ్యున్నతి కోసం చేసిన కృషిని కొనియాడారు. బార్ ప్రెసిడెంట్ బుగత శివ మాట్లాడుతూ అంబెడ్కర్ని ఆదర్శంగా తీసుకొని న్యాయవాదులు  అణగారిన వర్గాల కోసం పనిచేయాలని అని పిలుపు నిచ్చారు.
        ఈ సభకి బార్ ప్రెసిడెంట్ బుగత శివ, ట్రెజరర్ ఆర్ వెంకటరావు, కల్చరల్ సెక్రటరీ బి మధుబాబు, సీనియర్ న్యాయవాది కె వి జగన్నదరావు,గంగాధర్, రాజాల చిట్టిబాబు, అకాశపు మల్లేశ్వరరావు, బి.నరసింహారావు, చలం, నాగేంద్రరాజు, రాజేష్  లు పాల్గొరు.