ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే  మాంసాన్ని విక్రయించాలి

 


ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే  మాంసాన్ని విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్ డాక్టర్ బాబు భేరి హెచ్చరించారు. సోమవారం దిలీసుఖ్ నగర్, చైతన్య పురి, బజార్ ఘాట్ తదితర ప్రాంతాల్లో ని సుమారు 11 మాంసం దుకాణాల లో తనిఖీలు నిర్వహించారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మాంసం ధరల నియంత్రణ కు ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తనిఖీల లో లైసెన్స్ లేని, నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న 5 షాపులను మూసివేయించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా కిలో మటన్ 700 రూపాయలకు విక్రయించాలని, ధరలను తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులను ఆదేశించారు. కరోనా నేపధ్యంలో మాంసం కోసం వచ్చే ప్రజలు  కనీస దూరం పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల లో డాక్టర్లు ఖాద్రి, నిజాం, సుభాష్ తదితరులు ఉన్నారు.


Popular posts
సీమాంధ్రుల కలల రాజధాని కోసం ఉద్యమిస్తాం*
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో