సామాజిక పరివర్తనే
సరైన ఆయుధం
కరోనా కష్టాలు మూడు నుండో ఆరు నుండో కడతేరినట్టు కనపడ్డం లేదు..
ప్రపంచ మేధావులు వాక్సిన్ వెతుకులాటలో నిమగ్నమయ్యారు...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాల రక్షణలో తల మునకలై తపిస్తున్నారు...
మానవ స్వీయ తర్కం అవస్యం..
భయం గుప్పిట్లో గడప దాటని కోట్లాది ప్రజల జీవన శైలి మారిపోవాల్సిందే...
కిక్కిరిసే జన కార్యక్రమాలు కనుమరుగు కావాల్సిందే..
రాసుకు పూసుకునే పబ్బాలని మట్టు పెట్టాల్సిందే...
సమూహాలుగా సాగే సంతలు సంతర్పణలు దూరం చేయాల్సిందే...
చట్టాలు మనిషిని నిలువరిస్తాయి.. సామాజిక పరివర్తన మాత్రమే మనిషిని సంస్కరింప జేస్తుంది...
కాలానుగునంగా పద్దతైన జీవనంతో స్థైర్యమైన సమాజాన్ని నిర్మించు కుందాం.
సామాజిక పరివర్తనే సరైన ఆయుధం