కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 

అమరావతి


కలెక్టర్లు, ముస్లిం మతపెద్దలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ 


కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌


 
*వీడియో కాన్ఫరెన్స్‌లో అందరూ మాట్లాడాక సీఎం స్పందన*


*ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరికీ అందాలి.. ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి: సీఎం*


*ఈ రకంగానే ప్రభుత్వం పనిచేయాలని నేను గట్టిగా నమ్ముతున్నాను:*


అందుకనే కులాలు చూడ్డంలేదు, మతాలు చూడ్డంలేదు, రాజకీయాలు చూడ్డం లేదు, పార్టీలు చూడకుండా అందరికీ పథకాలు అందిస్తున్నాం:


కొత్త పథకాలు అమలు చేశాం:
తోఫా అన్నది పండుగ వచ్చినప్పుడు మాత్రమే వారిని గుర్తుకు తెచ్చుకుని శనక్కాయలు, బెల్లాలు మాదిరిగా ఇవ్వడం కరెక్టుకాదని నేను ఎప్పుడూ నమ్ముతాను:


*ప్రతి నెలా తోఫా ఉండాలి:*
*పండుగ వచ్చినప్పుడే గుర్తు పెట్టుకోవడం కాదు*


సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఒక కమ్యూనిటీని గుర్తుపెట్టుకుని శనక్కాయలు, బెల్లాలు మాదిరిగా ఇవ్వటంకాదు:


ప్రతి పేదవాళ్లు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ప్రతి పేదవర్గానికీ 
దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో.. ప్రతి నెలా  కూడా ఒక కొత్త కార్యక్రమంతో... ప్రతి ఒక్కరికీ మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం:


రైతు భరోసా, అమ్మ ఒడి.. ఇలా దేవుడి దయతో అనేక కార్యక్రమాలు అమలు చేశాం:


అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను రూ.2,250 రూపాయల వరకూ తీసుకెళ్లాం:


ఈ 10 నెలల కాలంలో ప్రతి అడుగూ కూడా మీకు అందరికీ కనపడే విధంగా దేవుడు చేయించగలిగాడు:


కరోనా వల్ల ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాకూడా.. .రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ. 150 కోట్ల పైచిలుకు ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ.. .ఇప్పుడు సున్నా అయిపోయింది:


రూపాయి కూడా ఆదాయం రాని పరిస్థితి:
ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు పూర్తిగా సున్నా అయినా.. కరోనా కారణంగా ప్రజలు, పేదవాళ్లు ఇబ్బంది పడకూడదని ఎక్కడా లేని విధంగా అడుగులు ముందుకు వేశాం:


బీపీఎల్‌ కుటుంబానికి రూ.1000లు ఇచ్చాం:
పేదరికంలో ఉన్నవారికి తోడుగా నిలిచాం:


*నెలకు ఒకసారి రేషన్‌కు బదులు నెలలో మూడుసార్లు కార్యక్రమం చేపట్టాం:*


ఉచితంగా రేషన్, పప్పు దినుసులు ఇచ్చాం:


*రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా, పేదవాడ్ని కాపాడుకోవాలనే దృష్టితో తీసుకున్న చర్యలు కారణంగా అనుకోని ఖర్చులు వచ్చాయి:*


వైద్యంకోసం, సర్వేలకోసం, క్వారంటైన్లకోసం, ఇతరత్రా అంశాల కోసం ఖర్చులు బాగా పెరిగాయి:
ఇవన్నీకూడా బేరీజు వేసుకుంటూ..., ఆర్థిక కష్టాల్లో ఉన్నాకూడా.. ఎలాంటి ఇబ్బంది మన ప్రజలకి రాకూడదనే ఉద్దేశంతో చిరునవ్వుతో ఇవన్నీ దిగమింగుకుంటూనే మరోవైపు అడుగులు ముందుకు వేస్తున్నాం:


*కష్టాల్లో ఉన్నా కూడా ఈ నెలలోనే పొదుపు సంఘాల్లోని మహిళలు అందరికీ 24వ తేదీన సున్నా వడ్డీ కార్యక్రమానికి దాదాపు రూ.1400 కోట్లు  ఇవ్వబోతున్నాం:*


కలెక్టర్లు పర్యవేక్షణ చేసుకోమని చెప్తున్నాం:


అదే విధంగా ప్రతి పేదవాడికీ చదువులు చెప్పించే కార్యక్రమంలో భాగంగా.. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం కోసం ఈనెలలోనే ఎప్పుడూ జరగని విధంగా , ఎక్కడా రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్లు క్లియర్‌ చేశాం


ఈ విద్యాసంవత్సరంలో కూడా పూర్తి బకాయిలు, మార్చి 31 వరకూ ఒక్క రూపాయి బకాయి లేకుండా పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ బుధవారం నాటికి చెల్లిస్తున్నాం:


ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకానికి సుమారు రూ.4వేల కోట్లపైన ఖర్చు:


వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లి అక్కౌంట్లోకి నేరుగా వేస్తాం. ఆ డబ్బును తల్లి నేరుగా కాలేజీలకు కడుతుంది:


జూన్‌లో కాలేజీలు ప్రారంభమైతే.. సెప్టెంబరు నాటికల్లా తల్లి అక్కౌంట్లో వేస్తాం:


కష్టాల్లో ఉన్నా.. కూడా చేయాల్సిన పథకాల విషయంలో ముందడుగు వేస్తున్నాం:


కరోనా లాంటి ఇబ్బందికర సమయాల్లోకూడా కవర్‌ అయిన ప్రతి మసీదుకు సంబంధించి రంజాన్‌ నాటిని పూర్తి బకాయిలు చెల్లిస్తాం...


కవర్‌కాని మసీదుల్లోని, ప్రతి మసీదుకూ రూ.5వేల రూపాయలు గ్రామ వాలంటీర్‌ ద్వారా చెల్లిస్తాం:
ప్రతి చర్చికీ రూ.5వేలు ఇస్తాం:
అలాగే ప్రతి గుడికీ రూ.5 వేలు ఇవ్వమని ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం: 


ఈ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం:
ఈ ప్రభుత్వం మీది.. మన అందరిదీ..:


ముస్లిం మతపెద్దలు చెప్పిన అన్ని  అంశాలనూ డిప్యూటీ సీఎం నోట్‌ చేసుకున్నారు:


ఇచ్చిన సూచనలు సలహాలకు మెరుగులు దిద్ది పద్దతి ప్రకారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు:
ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేలా మీరు సందేశం అస్తారని చెప్తున్నందుకు మీకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా:


14 రోజుల తర్వాత క్వారంటైన్లో ఉన్నవారుకూడా పరీక్షలు చేయించుకోవాలి:
క్వారంటైన్‌ నుంచి ఇంటికి వెళ్లేవారికి రూ.2వేలు ఇస్తున్నాం:


ఇంటికి వెళ్లాక మంచి పౌష్టికాహారం తినడానికి ఈ డబ్బు ఇస్తున్నాం:
దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: 


*క్వారంటైన్లో ఉన్న ముస్లింలకు రంజాన్‌ సమయంలో వాళ్లు తీసుకునే ఆహారాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశాలు*


రంజాన్‌మాసంలో దాన ధర్మాలు  చేస్తారు కాబట్టి.. ఇచ్చేవారికీ, స్వీకరించే వారికి ఒక పద్దతిని ఏర్పాటు చేయాలన్న సీఎం.