పేదలకు అండగా ఉండే పూచీ మాది
ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి
చిలకలూరిపేట శాసనభ్యురాలు విడదల రజిని
విడదల రజిని (వీఆర్) ఫౌండేషన్ ద్వారా అర్చకులకు కూరగాయలు, నిత్యావసరాలు, బియ్యం పంపిణీ*
పేదలకు అండగా ఉండే పూచీ తనదని, ఎవరూ దయచేసి ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. విడదల రజిని (వీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని దాదాపు 100 మంది అర్చకులు, పురోహితుల కుటుంబాలకు ఎమ్మెల్యే శనివారం బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందజేశారు. కరోనా విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయని తెలిపారు. మనదేశంలోనూ గడిచిన 18 రోజులుగా లాక్‌డౌన్ పాటిస్తున్నామని చెప్పారు. ఫలితంగా ఎందరో నిరుపేదలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆలయాలు మూసివేయడం, శుభకార్యాలూ ఆగిపోవడంతో అర్చకులు, పురోహితులు ఇళ్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు తాము ముందుకొచ్చామని వివరించారు. అర్చకులు, పురోహితుల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందజేసినట్లు చెప్పారు. దూపదీప నైవద్యం అందని అర్చకులకు తమ ప్రభుత్వం కూడా రూ.5వేలు ఆర్థిక సాయం ప్రకటించిందని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి మన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారిని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హాఖాన్, పార్టీ నాయకులు కొలిశెట్టి శ్రీనివాసరావు (గోల్డు), పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదలకు అండగా ఉండే పూచీ మాది