రోడ్ల పై ముళ్ళ కంపలు వేసే వాళ్ళకు..

రోడ్ల పై ముళ్ళ కంపలు వేసే వాళ్ళకు 


ఒక్కటి నాకు అర్ధం కావట్లేదు నిర్బంధం అంటే మిమ్మల్ని ఇంట్లో ఉండండి అంటున్నారు కానీ, రోడ్లకు అడ్డుగా ముళ్ళకంపలు, మట్టి పోసి ,కంచెలు నాటి ఎదో చేసాం అనుకుంటే ఎమర్జెన్సీ సర్వీస్, అంబులెన్స్, పోలీస్ ,పాలు, అగ్నిమాపక వాహనాలు రాకపోకలు ఎలా?? రాగానే తీసేస్తాం అంటే రాత్రిళ్ళు అవసరం వస్తే ఎవడు వచ్చి తీస్తారు ? ముళ్ల కంపలు, మట్టి?? 
జబ్బుతో, పురిటి నొప్పులో, హార్ట్ ఎటాక్ తో మీ ఊర్లోని ఎవరికైనా వస్తే మీ ఇంటికి 108 వాహనాలు రాత్రిళ్ళు ఐన పగలు ఐన ఎలా వస్తాయి?? మీరు చేసే చెత్త పనులకు సమయం చాలక ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది.  


దయచేసి మీకు చెప్పేది ఒక్కటే రహదారులకు అడ్డుగా ఉన్న ముళ్ళకంపలు, మట్టి , కంచెలు తొలంగించండి తాడు కట్టి కాపలా ఉండండి విడతల వారిగా అర్ధం చేసుకోండి దయచేసి, మన ఇంట్లో వాళ్లకే అత్యవసర చికిత్స వస్తే ఎమ్ జరుగుతుందో ఆలోచించండి. 


కరోన కట్టడికి మీరు చేసుతున్న పోరాటం అద్వితీయం కానీ మన వేలుతో మన కంటిని పొడుచుకోవద్దు.