మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి సహకారం చేయూత ఫౌండేషన్ వారి వితరణతో ఇబ్రహీంపట్నం లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
సోమవారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి సహకారంతో ఏర్పాటు చేసిన అల్పాహారం తో పాటు చేయూత ఫౌండేషన్ వారి సహకారం తో కూరగాయలు పంపిణీ చేపట్టగా స్దానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పంపిణీ చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం పట్ల నాయకులు దాతలను అభినందించారు.