ముఖ్యమంత్రి సహయనిధి కి ఆర్ధిక సహాయం చెక్కులు

ముఖ్యమంత్రి సహయనిధి కి ఆర్ధిక సహాయం చెక్కులు అందజేసిన గణపవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.


మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షురాలు జి పద్మావతి గారు రూ 20 వేలు, జి వి రామ్మోహన్ రెడ్డి గారు రూ 10 వేలు, వి సీతారామిరెడ్డి గారు రూ 10 వేలు చెక్కుల రూపంలో , వాలంటీర్ గా పనిచేస్తున్న వజ్రాల నందిని రూ 5వేలు నగదు గా ముఖ్యమంత్రి సహయనిధి కి విరాళంగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి కి అందజేశారు. ఈ మెత్తం చెక్కులను యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారి ద్వారా మైలవరం తహసిల్దార్ రోహిణీ దేవి గారి కి అందజేయాల్సిందిగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు సూచించారు*


*ఈ కార్యక్రమంలో గణపవరం గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారు మాజీ యార్డు చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి గారు మైలవరం జడ్పీటీసీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న స్వర్నాల తిరుపతి రావు గారు వాలంటీర్లు పాల్గొన్నారు.