నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో, సర్వేపల్లి నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో సమావేశమై, కరోనా పరిస్థితులపై సమీక్షించిన ఎమ్మెల్యే కాకాణి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు, అమ్మకాలు జరిపి, సజావుగా లావాదేవీలు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కోరిన ఎమ్మెల్యే కాకాణి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెంటనే ఆన్ లైన్ సేవలు ప్రారంభించి, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే కాకాణి.
ఆక్వా రైతుల ఇబ్బందుల దృష్ట్యా రొయ్యల కొనుగోలు కోసం పాత మార్కెట్లను పునరుద్ధరించడం, కొత్త మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రొయ్యల అమ్మకాలు, కొనుగోలు చేపట్టి ఆక్వా రైతులను ఆదుకోవాలి.
ఆక్వా రైతులు తమ కార్యకలాపాలు సాగించుటకు ఎక్కడ అడ్డుతగలకుండా పోలీసులు సహకరించాలి.
నిమ్మ రైతుల కోసం వెంటనే నిమ్మ మార్కెట్లను ప్రారంభించాలి.
అవసరమైన చోట అదనపు వైద్యులను నియమించి, నియోజకవర్గ స్థాయిలో అధికారులందరి సమన్వయంతో ప్రజలకు అండగా నిలవాలి.
రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.