కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


కరోనా నివారణకు ప్రజలు భౌతిక దూరం తప్పక పాటించాలి.


కడప పట్టణంలోని అన్ని డివిజన్లలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుంది.


రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా.


కడప, కరోనా వైరస్ మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వైరస్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాషా పేర్కొన్నారు.
             ఉదయం ఉప ముఖ్యమంత్రి వర్యులు అక్కా యపల్లె, బాలాజీనగర్  లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
       ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  ఎస్ బి. అంజాద్ బాషా మాట్లాడుతూ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని ఈ వ్యాధి నివారణకు సామాజిక దూరంతో పాటు వ్యక్తి గత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. కడప నగరాన్ని ఐదు జోన్ లు గా విభజించి అన్ని డివిజన్లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. దీంతో క్రిమి కీటకాలు చనిపోయి కరోనా వైరస్  ను కొంత వరకూ నివారించవచ్చునన్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం 190 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. కరోనాతో ఒకరు చనిపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి కరోనా వైరస్ నివారణ తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. కడప జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇందులో నెగటివ్ వచ్చిన వారిని క్వారంటైంన్ కు పంపడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కరోణ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. మరియు ఆ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరం వరకు బఫర్ జోన్ గా ప్రకటించటం జరిగిందన్నారు. ప్రజలు కొద్దిరోజులు ఇళ్లకే పరిమితం కావాలని ఎవ్వరు కూడా బయట తిరగకూడదన్నారు.
                  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, మాజీ కార్పొరేటర్ పాకా సురేష్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.