గత కొన్ని రోజులలో కరోనా వల్ల నేర్చుకున్న కొన్ని పాఠాలు

గత కొన్ని రోజులలో కరోనా వల్ల నేర్చుకున్న కొన్ని పాఠాలు:


 1. అమెరికా ఇకపై ప్రపంచంలో అగ్రరాజ్యం కాదు.
 2. చైనా మూడవ ప్రపంచ యుద్ధంలో క్షిపణిని ప్రయోగించకుండా గెలిచింది.
 3. యూరోపియన్లు కనిపించినంత వివేకవంతులు కాదు.
4. యూరప్, అమెరికాలను పర్యటించకుండా కూడా మనం సెలవులు గడపగలం.
5. ధనవంతులు నిజానికి పేదల కంటే తక్కువ రోగనిరోధక శక్తి కలవారు.
 6. ధరలు పెరుగుతున్నప్పుడు, మానవులు వారి సామాజిక ఆర్ధిక స్థితితో సంబంధం లేకుండా అవకాశవాదులుగా మారుతారు.
7. పూజారులు, ఫాదర్లు, ప్రవక్తలు, దేవుళ్లు రోగులను రక్షించలేరు.
 8. మానవులే గ్రహం మీద నిజమైన వైరస్ లు.
9. రెడ్ టేపిజం లేకుండా పేదలకోసం కోట్లు ఖర్చు చేయవచ్చు.
10. డాక్టర్లు/ఆరోగ్య శాస్త్రవేత్తలు- క్రికెట్ ఫుట్ బాల్ ఆటగాడి కంటే ఎక్కువ విలువైనవారు.
11. వినియోగంలో లేనప్పుడు చమురు కూడా పనికిరాని వస్తువు.
12. జూలో ఇన్నాళ్లు జంతువులు ఎలా భావించాయో.
13. మనుషులు లేకుండా గ్రహం త్వరగా పునరుజ్జీవమౌతుంది.
14. మెజారిటీ ప్రజలు ఇంటి నుండి పని చేయవచ్చు.
15. పిల్లలు, పెద్దలు జంక్ ఫుడ్ లేకుండా జీవించగలరు.
16. చిన్న నేరాలకు జైలులో ఉన్న ఖైదీలను విడుదల చేయవచ్చు.
17. పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం అస్సలు కష్టం కాదు.
18. మహిళలే కాకుండా ఎవరైనా ఇంటిపని/వంటపని చేయవచ్చు.
19. ప్రపంచంలో మంచి వాళ్లకు కొదవలేదు.
20. ఎక్కువ విద్యాలయాలు, ఉత్తమ విద్య, అత్యుత్తమ పరిశోధన అందిస్తే తక్కువ ఆసుపత్రులు అవసరమవుతాయి.