పేద కుటుంబాలకు   ట్రస్ట్ సాహయంగా  ఉచితముగా  కాయగూరలు పంపిణి

ఈరోజు 33 వార్డు లో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విల్లూరి డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో రోజు కూలి నాలి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని తద్వారా కుటుంబాన్ని పోషించే కొనే వారికి, ఈ  కరోనా మహామారి వల్ల వీరికి పనులు లేక పోవడం వల్ల, వార్డు లో ఉన్న పేద కుటుంబాలకు   ట్రస్ట్ సాహయంగా  ఉచితముగా  కాయగూరలు అనగా 1..కేజీ  బంగాళాదుంపలు  2. కేజీ ఉల్లిపాయలు  3.కేజీ వంకాయలు 4.కేజీ మిరపకాయలు  ఇవ్వడానికి నిశ్చయించడం జరిగింది.


 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ అర్బన్  జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు ట్రస్ట్ చైర్మన్  విల్లూరిడాక్టర్ చక్రవర్తి  చేతుల మీదగా సుమారు 200 మందికి ఇంటింటికి తిరిగి వీరి అందరకు  ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో  33 వ వార్డు వివిధ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి విల్లూరి తిరుమల దేవి ,మాధవి ,సత్య ,పద్మ ,జ్యోతి ,రవి,ఫాతిమా ,మౌలాలి ,తదితరులు పాల్గొన్నారు అలాగనే సమదూరం పాటించి ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండగా ప్రతి ఇంటికి  ఇవ్వడం జరిగింది కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వయం శుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడు కొని మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు,మరి మా ప్రియతమ నేత    విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు  పిలుపు మేరకు మనందరం కూడా క్రమశిక్షణగా 21 రోజులు  ఇంట్లోనే ఉండి అలాగే ప్రతి ఒక్కరు వేడి ఆహారాన్ని తీసుకొని ఎవరికైనా ఏ విధమైన సమాచారాన్ని కైనా  1902 కి ఫోన్ చేసి నీ యొక్క సమస్యల్ని తెలియజేయండి ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ విల్లూరి డాక్టర్ చక్రవర్తి  పోలీసువారికి, మెడికల్ సిబ్బందికి, జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, కృతజ్ఞతలు తెలియజేశారు . మరొక్కసారి 33 వ వార్డు ప్రజలందరికీ కరోనా మహామారి మీద అప్రమత్తంగా ఉండాలని విన్నవించుకుంటున్నారు.