పాత్రికేయులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

పాత్రికేయులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ...సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ .              


 కోస్తా ప్రభ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మాస్క్లు  గ్లౌజులు , కాయ గూరలు  పంపిణీ  ...నేటి సమాజంలో పాత్రికేయులు అయితే కీలకమైన పాత్రని ,లాక్డౌన్ కారణంగా జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు .భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కోస్తా ప్రభ ఆధ్వర్యంలో విజయవాడలో జర్నలిస్టులకు మాస్కులు గ్లౌజులు పంపిణీ చేశారు .వీటిని డైరెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సుమారు  200,మంది  జర్నలిస్టులకు అందించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా  సమయంలో పాత్రికేయులు చేస్తున్న సేవ ఎనలేనిదని కొనియాడారు .జాతి గర్వించదగ్గ నేత దేశానికి దశ దిశ నిర్దేశించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు .డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు .ఏడి సదారావు ,200మంది జర్నలిస్టు దాతలు పాల్గొన్నారు .           పారిశుద్ధ కార్మికులకు కాయగూరలు పంపిణీ ...విజయవాడలోని సుమారు వంద మంది పారిశుద్ధ్య  కార్మికులకు  కోస్తా ప్రభ ఆధ్వర్యంలో మాస్కులు గ్లౌజులు కాయకూరలు పంపిణీ చేశారు. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?