రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా జగన్ తీరు.

 


రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా జగన్ తీరు- కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి 
పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు- *దేవినేని*
 
         రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా జగన్ తీరు ఉందని మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాడు-నాడు పేరుతో రివర్స్ టెండరింగ్ అంటూ బోర్డులు, చాక్ పీస్ లు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాతో పాటు 12 జిల్లాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయి. జగన్ నిర్లక్ష్యం వల్ల రాష్టంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా టెస్ట్ ఫలితాలను ఆలస్యంగా వెల్లడిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. కమ్యూనిటీ ట్రాన్స్ ఫర్ జరుగుతోందని నేను గతంలోనే చెప్పాను. 72 కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. దీనిని ఏం సమాధానం చెబుతారు  సూచనలు చేసిన వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. విజయవాడను కర్ఫ్యూ వాతావరణానికి తీసుకువచ్చారు. కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అభినందించాలి.  ప్రభుత్వానిది లెక్కలేనితనం. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జగన్మోహన్ రెడ్డి వీడియో గేమ్స్ కు పరిమితం అయ్యారు. విజయసాయిరెడ్డి అచ్చోసిన అంబోతులా తిరుగుతున్నారు. విశాఖలో ఛాతి ఆసుపత్రిలో 51 కేసుల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు. వైసీపీ నేతల ఊరేగింపులతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని చెబుతుంటే పట్టించుకోవడం లేదు.  చంద్రబాబునాయుడు గారు రాసిన లేఖలకు స్పందన లేదు.              ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రధాని, చంద్రబాబు గారు చెబుతుంటే జగన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. మీడియా ముందుకు వచ్చే ధైర్యం ఎందుకు చేయడం లేదు 24 గంటల్లో 61 కేసులు బయటపడితే ఏం సమాధానం చెబుతారు. ట్రూనాట్, వీటీఎం, ఆర్టీపీసీ టెస్ట్ లు జరుగుతున్నాయా లేక ఆపారో జగన్ సమాధానం చెప్పాలి. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో చేస్తున్నారా, లేక ఆపారా, లేక పూర్తిస్థాయిలో జరుగుతున్నాయా సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని మరణాలు చోటుచేసుకున్నాయో చెప్పాలి. ఏయే జిల్లాల్లో ఎన్ని టెస్ట్ లు చేశారో చెప్పాలి.  వాస్తవాలు ఎందుకు దాస్తున్నారు.  మరోవైపు ఇంగ్లీషు మీడియం కావాలా, తెలుగుమీడియం కావాలా అని వాలంటీర్లను అడ్డుపెట్టుకుని తల్లిదండ్రులతో సంతకాలు చేయిస్తున్నారు. పదో తరగతి పరీక్షలను పెట్టగలిగారా. అదే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనలతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఏం చేస్తారో కూడా కనీసం చెప్పడం లేదు. అమరావతి రైతులను రోడ్డున పడేశారు. రాజధాని తరలింపు కోసం విశాఖలో కేసులను దాస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్స్, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏపీలో పర్యటించి ఏం జరుగుతుందో తెలియజేయాలి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.
             రబీలో 55 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంది. ఎంతమేర కొన్నారో చెప్పాలి. 372 కోట్లు ధాన్యం బకాయిలు ఉన్నాయి.  మొక్కజొన్న 14.50 లక్షల టన్నులు రైతుల వద్ద ఉన్నాయి. శనగ 5.50 లక్షల టన్నులు, పసుపు 2 లక్షలు, మిర్చి 8.50 లక్షలు, కంది 1.90 లక్షల టన్నులు, మినుము 2.50 లక్షలు, పెసర 50వేల టన్నులు రైతుల వద్ద ఉన్నాయి. వీటిల్లో ఎంత మేర కొనుగోలు చేశారు. అరటి 10వేల మెట్రిక్ టన్నులు ఉంది. అరటి గెల రూ.50కూడా లేదు. ఆక్వా రైతులు నష్టపోయారు. చేపల రైతుల బాధలు వర్ణనాతీతం. మార్కెట్ సదుపాయం కల్పించడం లేదు. ఇసుక మాఫియా మాత్రం ఇష్టారాజ్యంగా నడుస్తోంది. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్ గా మారి దోపిడీ చేస్తున్నారు. మామిడి రైతును ఆదుకునేవారు లేరు. ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు ఏమైయ్యాయి. పుచ్చకాయ, కర్భూజకు తేడా తెలియని మంత్రి ఉన్నారు. పసుపు ఎంతమేర కొన్నారో చెప్పాలి. లంక గ్రామాల్లో పండే పంటలను పట్టించుకోవడం లేదు. జొన్నలు, సజ్జలు, కందులు, పెసలు, మినుములు, కొబ్బరి, పత్తి రైతులు నష్టాల్లో ఉన్నారు. పొగాకు సమస్యలపై జగన్ కనీసం సమీక్షించలేదు. శనగ రైతులను పట్టించుకోవడం లేదు. చినీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలి. సెస్ డబ్బులు ఉన్నాయి. ఎందుకు సీఎం మాట్లాడటం లేదు. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను, రైతు కూలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాడేపల్లి రాజప్రాసాదంలో జగన్ పబ్ జీ గేములు ఆడుకుంటున్నారు.