విద్యుత్  వినియోగదార్లు మార్చి నెల బిల్లు నే ఏప్రిల్ నెల బిల్లు గా భావించి పే చేయాలి

విద్యుత్  వినియోగదార్లు 


ఈ నెల అనగా MARCH-2020 నెల బిల్లు ఏప్రిల్2020 లో చెల్లించాల్సిన కరెంటు బిల్లు ఎవ్వరికీ ఇవ్వరు. మీటర్ రీడింగ్ తీయటానికి రీడర్ మన ఇంటికి రారు. కనుక పోయిన నెల బిల్లు ఎంతవుంటే అంతే ఈనెల కూడా కట్టాలి... లేదా మీ సర్వీస్ నంబరు తెలియజేస్తే ఈ నెలలో ఎంత కట్టాలో తెలుసుకోవచ్చు. మరియు వచ్చేనెల అనగా MAY లో రీడింగ్ తీస్తారు. అప్పుడు వచ్చిన రీడింగ్ యూనిట్లను రెండు భాగాలుగా విడదీసి చూపుతారు...ఇప్పుడు మీరు పోయిన నెల బిల్లే కట్టి, కట్టిన బిల్లు తో వుండే తేడాను కూడా అప్పుడు కట్టాలి...ఎక్కువ కడితే అది తరువాత బిల్లులో సర్దుబాటు చేస్తారు. మనము ఈ కరోనా దెబ్బకు ఇంట్లోనే ఉండి కాస్త ఎక్కువే కాల్చి బిల్లు చేసి ఉంటాము కనుక పోయిన బిల్లు కంటే ఎక్కువగా కట్టుకోవడం మంచిది..లేదు మేము పోయిన నెల బిల్లే కట్టుకుంటాము అంటే కూడా ఇబ్బంది లేదు. ఏది ఏమైనా కట్టిన ఎక్కువ, తక్కువ డబ్బు ఎక్కడికి పోదు.. కట్టుకోవడం వల్ల మనకే భారం తగ్గుతుంది.  ఏమైనా బిల్లును రెండు భాగాలుగా విడదీస్తారు కాబట్టి టారిఫ్ రేటు లో కూడా మార్పు ఉండదు. తేడా ఉన్న బిల్లుకు అపరాధ రుసుము పడదు. *NOTE*:- *కరెంటు బిల్ల అసలు కట్టకపోతే అపరాధ రుసుము వర్తిస్తుందని గమనించాలి*.


 మీరు చెల్లించాల్సిన బిల్లు *పై లింక్* మీద *క్లిక్*చేసి దానిద్వారా గాని లేదా ఏదైనా online పేమెంట్ app ద్వారా గాని చెల్లిచవచ్చు. మొదట పోయిన నెల బిల్లు చెల్లించి, తరువాత అదే లింకును కాసేపు తరువాత ఓపెన్ చేసి advance(ఎక్కువ కాల్చి ఉంటాము అనుకుంటే) మీ ఇష్టమొచ్చినంత amount ను జీరో స్థానంలో కొట్టి చెల్లించవచ్చు. చెల్లింపు అయిన వెంటనే మీకు success అని ఒక reference no వస్తుంది దాన్ని 
జాగ్రత్తగా ఉంచుకోవాలి...మీ పేమెంట్ సక్రమంగా చెల్లించి ఉంటే Department  నుండి కూడా 2 రోజుల్లో కట్టినట్లు message కూడా వస్తుంది... రాకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు.


Popular posts