పాత్రికేయులారా,మాస్కులను ధరించి కరోనా ను కట్టడి చేయండి

పాత్రికేయులారా,మాస్కులను ధరించి కరోనా ను కట్టడి చేయండి


హెల్త్ ఇన్సూరెన్స్ ను జర్నలిస్టులకు వర్తింపచేయాలి.


కర్నూలులో రాయలసీమ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు,ఫోటోగ్రాఫర్లకు,ఛానల్ వీడియో గ్రాఫర్ లకు మాస్క్ లను,సానిటైజర్లను అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రామ గిడ్డయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ పాత్రికేయులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేనప్పటికీ కరోనా రక్కసికి వెరవకుండా నిరంతరంగా వార్తలను సేకరిస్తూనే ఉన్నాము.కానీ మనకు కూడా కుటుంబాలు ఉందన్న విషయాన్ని మరిచి మాస్కులు ధరించకుండా సమాజం బాగు కొరకు ఎంతో తీవ్రంగా కృషి చేస్తున్నాము, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి,సానిటైజర్లతో తరచూ చేతులను శుభ్రపరచుకుని వార్తలు కొరకు వెళ్లవలసిందిగా అధ్యక్షులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా సమాజంలో సామాజిక దూరాన్ని పాటించి వార్తలను సేకరించ వలసిందిగా తెలియజేశారు.అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా హెల్త్ ఇన్సూరెన్స్ లో జర్నలిస్టులను భాగస్వాములను చేసి,ప్రతి ఒక్క జర్నలిస్టుకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో రామ గిడ్డయ్య మాట్లాడుతూ ప్రతి ఒక విలేకరి ఆరోగ్యంగా ఉండాలని,అలాగే సమాజహితం కొరకు నిరంతర వార్తా స్రవంతి లో ఉండే విలేకరులు, ఫోటోగ్రాఫర్లు మరియు వీడియో గ్రాఫర్ లు మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రపరుచుకుని తమ కుటుంబాలను గుర్తుంచుకొని ఆరోగ్య సూత్రాలను పాటించాలని తెలియజేశారు.ప్రధానంగా వార్తల పై ఆసక్తి కొరకే కాక తమ కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా కరోనా వైరస్ పై తమకు చేతనైన విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అదే విధంగా ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పత్రికల విలేకరులు, ఫోటోగ్రాఫర్లు,అన్ని ఛానళ్ల వీడియో గ్రాఫర్ లు, అసోసియేషన్ మెంబర్లు భూపాల్,హుస్సేన్, నాగరాజు,వీడియో గ్రాఫర్ మధు తదితరులు పాల్గొన్నారు.