సేవా కార్యక్రమాలకు అండగా ఉంటా
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని
500 మందికి అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ
నియోజకవర్గంలో జరిగే ప్రతి సేవా కార్యక్రమానికి తాను అండగా ఉంటానని చిలకలూపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధుల్లో ఉన్న పట్టణంలోని ప్రభుత్వ సిబ్బంది సుమారు 350 మందికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏకాంబ్రం సునీత ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పంపిణీ కార్యక్రమానికి చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి చేతనైన సాయం అందించే వాళ్లే దేవుళ్లని తెలిపారు. కరోనా వ్యాధిని అరికట్టడం కోసం ఎంతో బాధ్యతతో పోలీసులు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ అల్పాహారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.