పోలీసు స్టేషన్ నిండినది.
అడ్డగోలు తిరుగుళ్లకు పోలీసుల అడ్డుకట్ట.
అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పోలీస్ స్టేషన్ కు తరలింపు....
లాక్ డౌన్ సమయాన్ని అతిక్రమించి విచ్చలవిడిగా తిరుగుతున్న వాహదారులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. అనవసరంగా బయట తిరగొద్దని పదే పదే చెప్పినప్పటికీ అధిక సంఖ్యలో వాహనదారులు రోడ్లు పై చక్కర్లు కొడుతున్నారు. దింతో నిబంధనలు అతిక్రమించిన వాహదారుల వాహనాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే 50కి పైగా వాహనాలు తరలించగా వాహన దారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించనున్నారు. ఇంకోసారి రోడ్డు పైకి అనవసరంగా వస్తే సీజ్ చేస్తామని సీఐ శ్రీధర్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు తరలించిన వాహనాలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణ నిండిపోయింది. లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణం లో పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.