దిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ అంశంపై రాద్ధాంతం.

దిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ అంశంపై రాద్ధాంతం చేస్తూ


కొరోనా తో  కమ్యూనల్  విషం చిమ్మడానికి విశేషకృషి చేస్తున్న మహానుభావులకు ఈ పోస్టు అంకితం!*
, విదేశాల్లో జనాన్ని వూడ్చేసిన మహమ్మారిపట్ల కనీస అప్రమత్తత లేకుండా, విగ్రహాలకూ, యుద్ద సామాగ్రికీ తప్ప విద్య, వైద్యాలకు నిధులు ఖర్చుపెట్టకుండా, వైరస్ వార్తలు వెల్లడైన తర్వాతకూడా 60,000పైగా విదేశాలనుండి తరళివచ్చినవారిని దేశమ్మీదకు వదిలేసి, బాధ్యతారాహిత్యాన్ని  ప్రశ్నించకుండా, కనీస వైద్యసదుపాయాలూ, యంత్రాంగాన్ని అప్రమత్తపరచకుండా, ప్రజలని సిద్దపరచకుండా -


ఇప్పుడు కొత్తవాదన సిగ్గులెని  మీడీయా ఊదరగొడుతోంది.జాతీయ మీడియా ఒకడుగు ముందుకేసి కరోనా జిహాద్ అంటుంది.  నోరులేని వలసకూలీలవల్లా, మైనారిటీలవల్ల, కొరుకుడు పడని డిల్లీ ప్రభుత్వం వల్ల కరోనా మహమ్మారి కట్టడిలేక విస్తరిచిందని ప్రచారం చేస్తుంది


 : కరోనా వైరస్ చైనా నుండి ప్రారంభమై ప్రపంచమంతా పాకింది. జనవరి 29 నాటికి పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ హెచ్చరించింది. మన ప్రభుత్వం ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. విదేశాల నుండి వేలకువేలు విమానాల్లో దిగుతూనే ఉన్నారు. 


 : కరోనా విషయంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాహుల్ గాంధీ హెచ్చరిక. అయినా ప్రభుత్వానికి చలనం లేదు. విమానాలు దిగుతూనే ఉన్నాయి.


 : ప్రపంచంలోని అనేక దేశాలు కరోనా దెబ్బకు విలవిల్లాడుతుంటే ట్రంపును ఆహ్వానించి అహమదాబాదులో దాదాపు లక్షమందితో  బహిరంగసభ. విమానాలు దిగుతూనే ఉన్నాయి.


మార్చి 10న దేశంలోని అనేక ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా హోలీ పండుగ జరుపుకున్నారు. దేవాలయాలు, మస్జిదులు, చర్చిలు, గురుద్వారాలు అన్నీ తెరిచేవున్నాయి. రైళ్లూ, బస్సుల్లో లక్షలాదిమంది ప్రయాణం చేస్తూనే ఉన్నారు.


 : మార్చి 13న మోడీ ప్రభుత్వం తరపున ప్రకటన. కరోనాతో ఇబ్బందేమీ లేదనీ, Health Emergency అవసరం లేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వమే ఆ మాట అనేసరికి, కరోనాను ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. యధావిధిగా విమానాలు దిగుతూనే ఉన్నాయి. గుళ్లూ గోపురాలు, మస్జిదులు, చర్చిలు అన్నీ కళకళలాడుతూనే ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోనూ మార్చి 18వ తేదీ వరకు రోజుకు 4000 మందికి తక్కువ కాకుండా భక్తులు హాజరవుతూనే ఉన్నారు.


అయితే నిజాముద్దీన్ ధార్మిక సమావేశం జరిగింది మార్చి 13, 14, 15 తేదీల్లో. అందులో 300 మంది దాకా విదేశీయులు పాల్గొన్నారు. వారికి వీసాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికింది కూడా కేంద్ర ప్రభుత్వమే. అప్పటికి లాక్డౌన్ లేదు. దేశం నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్లెవరూ కరోనాను అంటించుకుందామని రాలేదు. ఏదో భక్తిభావంతో అక్కడికి వచ్చారు.


మర్కజ్ నిజాముద్దీన్ అనేది తబ్లీగ్ జమాత్ కు అంతర్జాతీయ కేంద్రం. అక్కడ 70 ఏళ్ల నుంచి నిత్యం ధార్మిక సమావేశాలు జరుగుతుటాయి. కాశీ, తిరుమల ఆలయాల మాదిరిగానే, వచ్చేవారు, పోయేవారితో నిత్యం సందడిగా ఉంటుంది. ఆ సమావేశంలో పాల్గొన్నవారిలో కొంతమందికి కరోనా అంటుకున్నదే అనుకుందాం. దీనికి వారు బాధ్యులా? వేలాదిగా దేశంలో దిగుతున్న విదేశీయుల్ని కట్టడి చేసివుంటే ఇవాళ 130 కోట్లమందిని ఇబ్బంది పెట్టే అవసరం తప్పేది కదా?


ఆ తర్వాత మార్చి 22న భారత్ జనతా కర్ఫ్యూ విధించారు. ఆ రోజు సాయంత్రం వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి చప్పట్లు కొడుతూ, ప్లేట్లపై వాయిస్తూ హంగామా చేసిందెవరు? కరోనా వ్యాపించడానికి ఇది సరిపోదా? ఇప్పుడు లాక్డౌన్ విధించి వారమైంది. వేలాదిమంది వలస కార్మికులు దిల్లీ రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. వారిని పట్టించుకోవాల్సిన హోంమంత్రి గారు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఆ వలస కార్మికులతో కరోనా వ్యాపించగూడదని రూలేమైనా ఉందా?


కరోనా ఎవర్నీ క్షమించదు. బ్రిటన్ PM కూ వచ్చింది. ఇజ్రాయిల్ PM కూ వచ్చింది. బ్రిటన్ యువరాజుకూ వచ్చింది. సాక్షాత్తు ఒక దేశపు యువరాణి చనిపోయింది.


ఇప్పుడు విషం చిమ్ముతున్న మహానుభావుల పరిస్థితి చూస్తుంటే, వీటన్నింటికీ కారణం నిజాముద్దీన్ సమావేశమే అన్నట్లుంది.


నిత్యం మత విద్వేషాలు పెంచడమే వారి అజెండా అయినపుడు కరోనాను ఒక సాకుగా ఉపయోగించుకోవడంలో ఆశ్చర్యమేమీలేదు. 


అయితే అలాంటి మహానుభావులందరికీ నా విన్నపం ఒకటే. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఇలాంటి       *"విష"ప్రయోగాలు* చేయడం మాని మీ చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ ఉండండి. దాంతోపాటూ, తుప్పుపట్టిన బుర్రల్ని కూడా కాస్త శానిటైజర్ వేసి తోమండి. వీలైతే మనుషులను  కలపడానికి ప్రయత్నించండి. సోదరుల్లా కలిసిమెలిసివున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టకండి. ఎందుకంటే, మీరు చేస్తున్న పని మీరు పూజించే దేవుళ్లు కూడా ఎవరూ ఇష్టపడరు. 


Popular posts