వందల కిలోమీటర్లు నడుస్తూ ఊరికి చేరాలని రోడ్లు ఎక్కిన కూలీల గురించో
హాస్పిటల్ ల్లో నిరంతరాయంగా పని చేస్తున్న డాక్టర్స్, నర్స్ ల మీద దాడుల గురించో
కుటుంబాలని వదిలేసి 24 గంటలు రోడ్ల మీద కాపలా కాస్తున్న పోలీసుల ఇన్సూరెన్స్ గురించో
హాస్పిటల్లో వున్న మాస్కుల, గ్లోవ్ ల కొరత గురించో
ఇప్పటికీ చాలీ చాలని టెస్టింగ్ కిట్ల గురిం చో
మొత్తం జనాభాలో 5% మందికి కూడా ఇంత వరకు కొరొనా టెస్ట్ చేయలేని మన అసహాయత గురించో
గిట్టు బాటు ధర లేక వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా బత్తాయి, అరటి, దానిమ్మ, కర్భూజ పండ్లు వదిలేస్తూ న్న రైతుల గురించో
మర్కజ్ లో పాల్గొని, దేశమంతా వెళ్లిపోయి టెస్టింగ్ కు రాకుండా దాక్కున్న వాళ్ల అంతు చూసే దాని
గురించో
రోజు రోజుకీ గుండె నిబ్బరం కోల్పోతున్న సగటు భారతీయుడి కి ధైర్యం చెప్పే నాలుగు మాటల గురించో..మాట్లాడుతాడు అని అనుకొన్నా.
కానీ , " దీపం" వెలిగించండి అన్నాడు.