లాక్ డౌన్ అంటే ఏమిటి?
ఉదయం సాయంత్రం వాకింగ్ చెయ్యడమా?
లాక్ డౌన్ అంటే..?
100 మీటర్లకు ఒక్కరి చొప్పున, దూరంగా ఉన్న వాళ్ళను గుంపుగా ఒక్క చోటుకు చేర్చి, టిఫిన్ లు, పట్టెడు అన్నం పెట్టి పుట్టెడు ఫొటోలు దిగడమా..?
లాక్ డౌన్ అంటే..? టెంట్ వేసి వందల మందిని పిలిచి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదును చక్కగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. ఏ ఎలక్షన్ వచ్చినా మీ ఓట్లు నాకే అంటూ బహిరంగంగా పంచడమా?
అసలు కరోన వ్యాధి గురించి కొంచమైనా అవగాహన ఉందా.?
ఎవరికి తాక కుండా ,బండ్ల మీద ఎంతమంది తిరిగినా రాని అంటువ్యాధి అని అనుకుంటున్నారా..?
కరోన అంటే?
దుకాణాలు తెరిచే ఉన్నాయి కదాని ..
ఫార్మాలిటి కోసం ఒక కర్చీఫ్ కట్టుకొని ప్రతిరోజు వెళ్లి ఎప్పటి లాగే గుమిగూడి సరుకులు తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నంత మాత్రాన వచ్చే వ్యాధి కాదనుకుంటున్నారా..?
చదువుకున్నా మేధావులారా.
నీ దేశం కన్నా ఎన్నో రేట్లు అభివృద్ధి చెందిన దేశాలలో
జనం ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారో తెలిసి..!
దానికి గల కారణాలు ప్రతిరోజు, ప్రతిగంట ,
ప్రతి నిముషం టీవీల్లో చూస్తూ కూడా
30 శాతం మంది రోడ్లమీదకు వస్తున్నారంటే..
మీరు మనుషులు ఎలా అవుతారు
!
ఒక్క మీటింగ్ కు హజారైన 25 వేల మందివలన
దేశం ఇంత ..అతలా కుతలం అవుతుంటే.?
135 కోట్ల జనాభాలో..
30 శాతం మంది ,అంటే దాదాపు 40 కోట్ల మంది
ప్రతి రోజు రోడ్ల మీదకు వస్తున్నారు..
ఇదేనా లాక్ డౌన్ అంటే..?
ప్రతిరోజు రోడ్లమీదకు వస్తున్న 40 కోట్ల మందిలో... ప్రతి పదిలక్షల మంది లో ఒక్కడికి
వైరస్ ఉన్నా ,!!!
WHO లెక్కల ప్రకారం ఆ ఒక్కడు 45 మందికి వైరస్ తగిలిస్తే... ? అలా ప్రతిరోజు తగిలిస్తే..?
అలా లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఒక్కోడు 45 మందికి ఆ 45 మంది ఒక్కొక్కడు 45 మందికి ..అలా 400 మందితో మొదలై ఒక్క నెలరోజుల్లో ఎన్ని లక్షల మంది పాజిటివ్ అవుతారో లెక్కేసుకోండి.?
ఇప్పటికైనా మారండి..
లాక్ డౌన్ అంటే ఒక్క కుటుంబం నుండి ఒక్కడు మాత్రమే వారానికి ఒక్కసారి.. బయటకు వెళ్లడం..
రోడ్లు ఏడారుల్లా కనిపించాలి.
రోడ్లపై నిశ్శబ్దం.. స్మశానం లోలా ఉండాలి...
అలా ఉన్న వాతావరణం చూసి...
పరిస్థితి ఇంత గంభీరంగా ఉందా! అని ఇళ్లలో నుండి బాల్కనీలో నుండే చూసే వాళ్లకు ఉచ్చ పడాలి..
అది లాక్ డౌన్ అంటే..
బండ్ల మీద ముగ్గురు ముగ్గురు తిరగడం ఏంటీ?
వాకింగ్ లకు వెళ్లడం ఏంటి..? అరే అంతంత చదువులు చదువుకున్నారు! సైకాలజికల్ ట్రీట్ మెంట్
అంటే తెలియాదా..?
లేదంటే ఆ!!? 135 కోట్ల జనాభా కలిగి ప్రతి 14 వేల మందికి ఒక్కడే డాక్టర్ కలిగిన మన దేశంలో..
ప్రతి 5 గురికి ఒక్కడు శవం అవుతాడు..
ఈ 20 రోజుల్లో మీరు చేసిన తెలివి తక్కువ పనివల్ల అతి త్వరలో.. పాజిటివ్ కేసులు లక్ష దాటుతాయి
క్రమ శిక్షణకు మారు పేరైన వేదభూమి లో పుట్టారు..
ఇప్పటికైనా దయచేసి లాక్ డౌన్ యొక్క మర్మాన్ని అర్థం చేసుకొని.. దానికి తగినట్టుగా ప్రవర్తించండి.