130 మంది ఉపాధి హామీ కూలీలకు నిత్యావసర వస్తువులను ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి పంపిణీ.


ఉపాధి హామీ పథకం కింద నర్సరీ లలో పనిచేస్తున్న కూలీలకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేవు. అయినా ఇమత కాలం పెంచిన మెుక్కలు ఎండిపోకుండా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్న కూలీలు పస్తులుంటున్నారు. ఒకపక్క జీతాలు రాక మరోపక్క కరోనా కట్టడి సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్న కూలీల దీనస్థితి వై ఎస్ రెడ్డి ట్రస్టు చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి దృష్టికి వచ్చింది.  శనివారం  ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్ చేతుల మీదుగా 130 మంది ఉపాధి హామీ కూలీలకు నిత్యావసర వస్తువులను ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఘట్ కేసర్ మండలం లోని గ్రామపంచాయతీ నర్సరీలో పనిచేసే కూలీలకు తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులను అందించినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అవ్వడం వలన జీతాలకు ఏర్పడిన  ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ రెడ్డి, సర్పంచులు ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సెక్రటరీలు అధికారులు పాల్గొన్నారు