విధుల్లో నిర్లక్ష్యం.. 16 మంది పోలీసులపై వేటు

 


విధుల్లో నిర్లక్ష్యం.. 16 మంది పోలీసులపై వేటుగుంటూరు : అర్బన్‌ ప్రాంతంలో విధులలో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై ఎస్పీ వేటు వేశారు. దాదాపు 16 మంది పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. గుట్కా వ్యాపారులకు సహకరించడం, పేకాట రాయుళ్లతో కుమ్మక్కు అవడం, ద్విచక్ర వాహనదారుల వద్ద డబ్బులు వసూళ్లు వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా 16 మందిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అర్బన్ ఎస్పీ చర్యలతో పోలీసు సిబ్బందిలో కలవరం నెలకొంది.