. నరసరావుపేట పట్టణంలో గత కొద్ది రోజులుగా మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో 18 నుండి 22వ వార్డు ప్రజల సహాయార్థంగా ఏర్పాటు చేసిన కోవిడ్–19 హెల్ప్‌డెస్క్‌ను శుక్రవారం నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవురాయలు గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సందర్శించారు. అక్కడి విధివిధానాలు అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభాగ్యులకు ఆసరాగా 21వ వార్డు రామిరెడ్డి పేటలో ఏర్పాటు చేసిన షెల్టెర్‌ను ప్రారంభించారు.
కరోనా కేసులు అధికంగా ఉన్న నరసరావుపేట 21వ వార్డులో మాస్క్‌లు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు. వాలంటీర్ల సాయంతో సుమారు 3000 మందికి వీటిని అందిస్తున్నట్లు ఎంపీ, ఎమ్మెల్యేలు వివరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు గారు, రొంపిచర్ల తహశీల్దారు సైదులు గారు, నరసరావుపేట మార్కెట్‌యార్డు చైర్మన్ హనీఫ్ గారు, సదాశివరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్–19 హెల్ప్‌డెస్క్‌ను శుక్రవారం నరసరావుపేట లో.