కరోనా వైరస్ (కొవిడ్19)  నియంత్రణకు   మానవుని జీవన శైలిలో  మార్పులు రావాలి


కరోనా వైరస్ (కొవిడ్19)  నియంత్రణకు 
 మానవుని జీవన శైలిలో  మార్పులు రావాలి


*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*


డోన్ పట్టణం కరోనా వైరస్ నియంత్రణకు మానవుని జీవన శైలిలో  మార్పులు రావాలి
ముఖ్యంగా కన్ను, ముక్కు,చెవి,నోటి ని చేతులతో తాకేటప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాతే పై భాగాలను ముట్టుకునే విధంగా అలవాటు చేసుకోవాలి అలాగే ఇప్పటినుంచైనా సమాజానికి , ప్రకృతికి హాని చేయకుండా ఉండాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్  రఫి తెలిపారు. డోన్ మున్సిపల్ కమీషనర్  కె యల్ యన్ రెడ్డి సార్,ఆరోగ్య విస్తరణ అధికారి కె. కృష్ణమోహన్ గార్లు  విడుదల చేసిన కరోనా వైరస్ (కోవిడ్ 19) ముందు జాగ్రత్తల  కరపత్రాలను ప్రజలకు గత ముపై నాలుగు రోజులుగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పంపిణీ చేస్తూ అవగాహణ కల్పిస్తున్నారు.
సోమవారం కరపత్రల పంపిణీ లో ఫ్రెండ్స్ సిటి కేబుల్ సి హెచ్ బాబు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మహమ్మద్ రఫి మాట్లాడుతూ సామాజిక భాద్యతగా మనమందరం  మన కుటుంబాలతో స్వీయ రక్షణలో ఉండాలి. లాక్ డౌన్, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.