స్కూళ్లు రీ ఓపెన్..కేంద్రం విధించే కఠినమైన రూల్స్ ఇవే..?

స్కూళ్లు రీ ఓపెన్..కేంద్రం విధించే కఠినమైన రూల్స్ ఇవేనా..?


భారత్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 90 వేలు దాటాయి కరోనా కేసులు. మరికొద్ది రోజుల్లో లక్షకి చేరుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


ఈ క్రమంలో స్కూళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పదో తరగతి పరీక్షలను బంద్ చేసి.. విద్యార్థులను పాస్ చేయాలని విద్యాశాఖలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో తెలియదు. తెరిచాక ఎలా ఉంటున్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఒకవేళ ఓపెన్ చేసినా.. పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్లకు పంపుతారో లేదో తెలీదు. 


అందులోనూ మన దేశంలో స్కూల్ క్లాస్ రూమ్స్ చిన్నవిగా ఉంటాయి.
ఈ సమస్యలన్నింటిపై కేంద్ర మానవ అభివృద్ధి శాఖ.. బోర్డులు, స్కూళ్లు, టీచర్ల సలహాలు, సూచనలూ తీసుకొని.. కాలేజీలు, స్కూళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఒకవేళ స్టూడెంట్స్ స్కూళ్లకి వస్తే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ సంఖ్యను తగ్గించాలి. అలాగే కేంద్రం కొన్ని కఠినమైన రూల్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


1. స్కూళ్లు రీ ఓపెన్ చేసినా, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా వారానికి ఆరు రోజుల రూల్ తప్పనిసరి అంటోంది కేంద్రం. అంటే టీచర్లు, స్టూడెంట్స్ వారానికి ఆరు రోజులూ స్కూల్‌కి రావాల్సిందే.
2. ఒకే క్లాస్‌ రూమ్‌లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండరాదు
3. స్కూళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు, శానిటైజర్లు వాడటం తప్పనిసరి. వీటిని విద్యార్థులు పాటించకపోతే ఫైన్ విధించే అవకాశాలున్నాయి.
4. తల్లిదండ్రులే స్వయంగా స్కూళ్లకు పిల్లల్ని తీసుకొచ్చి దింపాలి
5. అలాగే ప్రతీ రోజూ స్కూళ్లలో శానిటైజ్ చేయాలి. లేకుంటే ఆ సంబంధిత స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది
6. ఇక ముఖ్యమైన సమస్య ఏంటంటే.. స్టూడెంట్స్‌ ఒకొరికరిని ముట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదే
7. స్టూడెంట్స్ తినేటప్పుడు కూడా చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని పలు సూచనలు చేసింది కేంద్రం.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
వర్క్‌ ఫ్రమ్‌ హోం’ వారికి జియో కొత్త ప్లాన్‌